విడుదలైన ‘మా’ డైరీ | ma diary Released | Sakshi
Sakshi News home page

విడుదలైన ‘మా’ డైరీ

Dec 13 2014 11:52 PM | Updated on Sep 2 2017 6:07 PM

విడుదలైన ‘మా’ డైరీ

విడుదలైన ‘మా’ డైరీ

తెలుగు సినీ నటులు, సాంకేతిక నిపుణుల సమాచారంతో ప్రతి ఏడాదీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)వారు డైరీని విడుదల చేస్తుంటారు.

 తెలుగు సినీ నటులు, సాంకేతిక నిపుణుల సమాచారంతో ప్రతి ఏడాదీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)వారు డైరీని విడుదల చేస్తుంటారు. తాజాగా కొత్త ఏడాదికి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ-2015’ ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ డైరీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ నటి జమునకు అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ -‘‘తెలుగు సినిమాకు సంబంధించిన నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఈ డైరీలో పొందుపరిచారు.
 
 ఎంతో శ్రమకోర్చి ప్రతి ఏడాదీ ఈ డైరీని అందిస్తున్న ‘మా’ వారికి అభినందనలు. మహానటుడు అక్కినేని చేతులమీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరగడం ఆనవాయితీ. కానీ... ఈ రోజు ఆయన లేరు. అందుకే.. ఆ బాధ్యత నాపై పడింది’’ అని అన్నారు. ఇంకా విజయనిర్మల, ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్, గిరిబాబు, నరేశ్, కవిత, అలీ, శివకృష్ణ, మహర్షి రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement