తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన నటుడు కృష్ణ(krishna ghattamaneni). దాదాపు యాభై ఏళ్ల పాటు తన సత్తా చాటిన ఈ లెజెండరీ నటుడు లోకాన్ని వీడి అప్పుడే మూడేళ్లు గడిచింది. నేడు(నవంబర్ 15) ఆయన వర్ధంతి . ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
‘తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
1965లో 'తేనె మనసులు' సినిమాతో హీరోగా పరిచయమై కృష్ణ, 350కు పైగా చిత్రాల్లో నటించారు. కౌబాయ్, జేమ్స్ బాండ్, రాబిన్ హుడ్ వంటి హాలీవుడ్ శైలి సినిమాలను తెలుగులో పరిచయం చేసి, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించిన మొదటి తెలుగు నటుడిగా గుర్తింపు పొందారు. 2022 నవంబర్ 15న కృష్ణ కన్నుమూశారు.
తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన… pic.twitter.com/NMADN49Ww5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2025


