
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించటం పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి శాశ్వతమైనది అని, నటుడిగా మోహన్‌లాల్ బహుముఖ ప్రజ్ఞ అసమానమైనదని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోహన్‌లాల్‌కు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
(చదవండి: కంప్లీట్ యాక్టర్ ఫాల్కే గ్రహీత – మోహన్‌లాల్)
కాగా, సినీ రంగంలో దేశంలోనే అత్యున్నతమైన అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2023 సంవత్సరానికి గాను మోహన్‌లాల్‌కు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాశాఖ శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ నెల 23న 71వ జాతీయ సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మోహన్‌లాల్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల మోహన్‌లాల్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Congratulations to Shri @Mohanlal on being awarded the Dadasaheb Phalke Award.
His contribution to Indian cinema is everlasting, and his versatility as an actor is unparalleled.
Wishing him continued glory and good health.#DadasahebPhalkeAward pic.twitter.com/Yqwhsa1S9z— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2025