లవ్లీ ఎంటర్‌టైనర్ | lovely Entertainer | Sakshi
Sakshi News home page

లవ్లీ ఎంటర్‌టైనర్

Oct 26 2015 11:49 PM | Updated on Sep 3 2017 11:31 AM

లవ్లీ ఎంటర్‌టైనర్

లవ్లీ ఎంటర్‌టైనర్

ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రా..రమ్మని’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది.

ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రా..రమ్మని’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. దీపక్, లోవే సాసన్, మధుర ముఖ్య తారలుగా దాసరి బ్రహ్మానందం దర్శకత్వంలో మిద్దె సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత మిద్దె పద్మశ్రీ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సీనియర్ నరేశ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ కీలక పాత్రలో ప్రముఖ నటుడు నటించనున్నారు. నవంబర్ 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: రాము పినిశెట్టి.

Advertisement
 
Advertisement
Advertisement