బాహుబలి 2 అద్భుతం : మాట మార్చిన కేఆర్కే | KRK Takes A U-Turn on Baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 అద్భుతం : మాట మార్చిన కేఆర్కే

May 16 2017 3:54 PM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి 2 అద్భుతం : మాట మార్చిన కేఆర్కే - Sakshi

బాహుబలి 2 అద్భుతం : మాట మార్చిన కేఆర్కే

సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా పెద్ద చిత్రాలు ఏవి రిలీజ్ అయిన నెగెటివ్ ట్వీట్ లతో హల్ చల్ చేస్తుంటాడు బాలీవుడ్

సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా పెద్ద చిత్రాలు ఏవి రిలీజ్ అయిన నెగెటివ్ ట్వీట్ లతో హల్ చల్ చేస్తుంటాడు బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమాల్, బాహుబలి 2 రిలీజ్ సమయంలోనే అదే స్థాయిలో నోరు పారేసుకున్నాడు. ప్రభాస్ ను జిరాఫీతో పోల్చిన కమాల్, రాజమౌళిపై కూడా అలాంటి కామెంట్సే చేశాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బాహుబలి 2 సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఈ ఎనలిస్ట్ కమ్ క్రిటిక్ మాట మార్చాడు.

'బాహుబలి 2 ఓ సినిమా కాదు.. ఉద్యమం. ప్రతి ఒక్కరు ఆ సినిమాలో భాగం కావాలని కోరుకుంటారు. బాహుబలి 2 సాధించిన విజయాన్ని రిపీట్ చేయటం రానున్న 30 ఏళ్లలో సాధ్యం కాదు. మూడో ఆదివారం కూడా బాహుబలి 2(హిందీ వర్షన్) 20 కోట్లకు పైగా వసూళు చేసింది. ఇది సాదారణ విషయం కాదు. రాజమౌళికి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు బాహుబలి 2 యూనిట్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. తప్పుడు రివ్యూ ఇచ్చినందుకు క్షమించండి. నాకు నచ్చకపోయినా ప్రజలకు నచ్చింది. క్షమించండి రాజమౌళి' అంటూ ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement