ఇప్పుడు రితిక | Koratala Siva releases the ‘Neevevaro’ first look motion poster | Sakshi
Sakshi News home page

ఇప్పుడు రితిక

Jul 7 2018 12:39 AM | Updated on Jul 14 2019 1:28 PM

Koratala Siva releases the ‘Neevevaro’ first look motion poster - Sakshi

రితికా సింగ్‌

అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్, సమంత రీసెంట్‌గా అదితీ రావ్‌ హైదరీ తమకు తామే సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రితికా సింగ్‌ చేరారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ ముఖ్య తారలుగా కోన ఫిలిమ్‌ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నీవెవరో’. ‘లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ నాట్‌ ది లవర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌.

రీసెంట్‌గా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను కొరటాల శివ లాంచ్‌ చేశారు. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు రితికాసింగ్‌. ‘‘నా రెండో తెలుగు సినిమా ‘నీవెవరో’ చిత్రానికి డబ్బింగ్‌ చెబుతున్నాను. ముందు నేను చెప్పగలనా? అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగు పూర్తిగా రాదు. కానీ భరద్వాజ్‌ ఎంతో సహాయం చేశారు’’ అని పేర్కొన్నారు రితికా సింగ్‌. వెంకటేశ్‌ నటించిన ‘గురు’ ద్వారా రితికా తెలుగుకి పరిచయమైన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement