క్యాస్టింగ్‌ కౌచ్‌కి వ్యతిరేకిని    

Koratala Siva reacts on casting couch and Sri Reddy issue - Sakshi

‘‘సినిమా (‘భరత్‌ అనే నేను’) పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నప్పుడు ఈ వార్తలు విన్నాను. ‘నా ఫ్రెండ్స్, వెల్‌ విషర్స్‌ అందరూ  గాసిప్‌లాగా వచ్చింది, ఆ వ్యక్తి నీ పేరు ఎక్కడా చెప్పలేదు’ అన్నారు. నేనూ పట్టించుకోలేదు. కానీ ఒక షాక్‌లాంటిది ఉంటుంది కదా. మన మీద ఆరోపణలు రావడం ఏంటి? అని.  దీని మీద క్లారిటీ ఇద్దామనుకుని మాట్లాడుతున్నాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో తనను ఉద్దేశించినట్లుగా వచ్చిన వార్తకు కొరటాల స్పందిస్తూ– ‘‘నేను క్యాస్టింగ్‌ కౌచ్‌కి వ్యతిరేకిని. అలాంటివి ఎప్పుడూ ఎంకరేజ్‌ చేయను. చాలామంది యాక్టర్స్‌తో సినిమాలు చేశాను. వాళ్లకు తెలుసు.. నేను వాళ్ళను ఎలా ట్రీట్‌ చేస్తానో. ఆడా మగా అని కాకుండా హ్యూమన్స్‌లాగా చూస్తాను.

‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ సంఘటనలు చూస్తే బాధగా ఉంటుంది. ఈ ఇష్యూపై  ఫైట్‌ చేస్తోన్న వాళ్లకు నా సపోర్ట్‌ ఉంటుంది. నా సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలను చూపించను. నాకు సింగిల్‌ పేరెంట్‌.  మా అమ్మగారే నన్ను పెంచారు. పెళ్లయ్యాక మా ఆవిడ. నా ౖలైఫ్‌లో ఎక్కువ ట్రావెల్‌ అయింది ఈ ఇద్దరితోనే. సినిమాలో చిన్న హార్ష్‌ ఎలిమెంట్‌ ఉన్నా నా భార్య ఊరుకోదు. ‘జీవితంలో ఇలాంటివి వస్తుంటాయి. మనం నిలబడాలి. స్వామి వివేకానంద మీదే వదంతులు వచ్చాయి’ అని నా భార్య చెప్పింది.  నా వైపునుంచి వివరణ ఇస్తే నాకు పీస్‌ఫుల్‌గా ఉంటుందని క్లియర్‌ చేస్తున్నాను’’ అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top