వీలు కుదిరితే విశాల్‌తో సినిమా చేస్తా : కొరటాల శివ | Koratala Siva at Jayasurya Audio Launched | Sakshi
Sakshi News home page

వీలు కుదిరితే విశాల్‌తో సినిమా చేస్తా : కొరటాల శివ

Aug 24 2015 12:05 AM | Updated on Sep 3 2017 8:00 AM

వీలు కుదిరితే విశాల్‌తో సినిమా చేస్తా : కొరటాల శివ

వీలు కుదిరితే విశాల్‌తో సినిమా చేస్తా : కొరటాల శివ

సుశీంద్రన్ చాలా మంచి దర్శకుడు. విశాల్ నాకు ఇష్టమైన హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకెళుతూ ఉంటాడు. తెలుగు, తమిళ భాషల్లో

 ‘‘సుశీంద్రన్ చాలా మంచి దర్శకుడు. విశాల్ నాకు ఇష్టమైన హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకెళుతూ ఉంటాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. సుశీంద్రన్ దర్శకత్వంలో  విశాల్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘జయసూర్య’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. డి. ఇమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ద ర్శకుడు కొరటాల శివ హైదరాబాద్‌లో విడుదల చేశారు.  
 
 ఈ వేడుకలో గోపీచంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. సుశీంద్రన్ చాలా మంచి స్క్రీన్‌ప్లే ఇచ్చారు. తెలుగులో త్వరలో ఓ  స్ట్రయిట్ సినిమా చేయనున్నా’’ అని చెప్పారు. కొరటాల శివ మాట్లాడుతూ- ‘‘సుశీంద్రన్ రూపొందించిన ‘నా  పేరు శివ’ సినిమా చూసే నా రెండు సినిమాలకు మదిని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నాను. అన్నీ కుదిరితే విశాల్‌తో సినిమా చేస్తాను’’ అని అన్నారు. ‘‘ ‘పల్నాడు’ తర్వాత నేను విశాల్‌తో చేసిన సినిమా ఇది. చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించాం’’ అని  సుశీంద్రన్ అన్నారు. ఈ వేడుకలో నటి కుష్బూ, హీరోలు నాని, కార్తీ, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక కాజల్ అగర్వాల్, నిర్మాతలు జవ్వాజి రామాంజనేయులు, జి. నాగేశ్వరరెడ్డి, నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement