కోన ట్వీట్‌పై కేటీఆర్ స్పందన ఏది?

Kona venkat request to KTR Over Piracy - Sakshi

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్వీటర్‌ ద‍్వారా తన దృష్టికి వచ్చిన అంశాలపై వెంటనే స్పందిస్తూ సదరు శాఖలను అప‍్రమత్తం చేస్తుంటారు. సినీరంగంతోనూ కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా వేడుకలకు అతిథిగా హాజరవ్వటమే కాదు, తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు కేటీఆర్‌. అయితే సినీరంగంతో ఇంత సన్నిహితంగా ఉండే కేటీఆర్‌.. సినీ రచయిత కోన వెంకట్‌ చేసిన ఓ ట్వీట్‌పై స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమాకు ప్రమాదకరంగా మారిన మూవీ రూల్స్‌ (movierulz) వెబ్‌సైట్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాల్సిందిగా కోన వెంకట్‌ సోషల్‌ మీడియా ద్వారా కేటీఆర్‌ ను కోరారు. తన మెసేజ్‌తోపాటు గత వారం విడుదలైన గాయత్రి, ఇంటిలిజెంట్‌, తొలిప్రేమ సినిమాలు మూవీరూల్స్‌ సైట్‌లో ఉన్న స్క్రీన్‌ షాట్‌ను కూడా పోస్ట్‌ చేశారు. కానీ ఈ విషయంపై కేటీఆర్‌ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఈ సైట్‌లో తెలుగు సినిమాలతో పాటు తమిళ, హిందీ సినిమాల పైరసీ లింక్‌లు కూడా రిలీజ్‌ అయిన 24 గంటలలోపే దర్శనమిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top