చచ్చేవరకూ న్యూడ్‌ సెల్ఫీలు పోస్టు చేస్తా! | Kim Kardashian West promises nude selfies until she dies | Sakshi
Sakshi News home page

చచ్చేవరకూ న్యూడ్‌ సెల్ఫీలు పోస్టు చేస్తా!

May 17 2016 3:12 PM | Updated on Oct 22 2018 6:02 PM

చచ్చేవరకూ న్యూడ్‌ సెల్ఫీలు పోస్టు చేస్తా! - Sakshi

చచ్చేవరకూ న్యూడ్‌ సెల్ఫీలు పోస్టు చేస్తా!

సెల్ఫీ క్వీన్‌, హాలీవుడ్ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ తాజాగా అభిమానులకు చిలిపి వరాన్ని ప్రసాదించింది.

లాస్‌ ఏంజిల్స్‌: సెల్ఫీ క్వీన్‌, హాలీవుడ్ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ తాజాగా అభిమానులకు చిలిపి వరాన్ని ప్రసాదించింది. తాను చనిపోయేవరకు 'న్యూడ్‌ (నగ్న) సెల్ఫీలు' దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటానని తాజాగా హామీ ఇచ్చింది. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మను తాజాగా 'బ్రేక్‌ ద ఇంటర్నెట్‌ అవార్డు' వరించింది. 20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ అవార్డును కిమ్‌ కర్దాషియన్‌కు ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన జీవితాంత నగ్న సెల్ఫీలు దిగి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది.

నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తకాదు. గత ఏడాది తన నగ్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్టుచేసి.. కిమ్ పెద్ద దమారమే రేపింది. ఆమె చర్యను పలువురు తప్పుబట్టగా.. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం కిమ్ దారిలో సాగుతూ.. తమ న్యూడ్‌ సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement