మామా... ఎక్కడున్నావ్‌!? | Khushboo to be playing a powerful role in Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మామా... ఎక్కడున్నావ్‌!?

Jun 7 2017 11:44 PM | Updated on Mar 22 2019 5:33 PM

మామా... ఎక్కడున్నావ్‌!? - Sakshi

మామా... ఎక్కడున్నావ్‌!?

మామ కోసం హీరో పవన్‌ కల్యాణ్‌ వెయిటింగ్‌! దాంతో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆయన్ను వెతికే పనిలో ఉన్నారు.

మామ కోసం హీరో పవన్‌ కల్యాణ్‌ వెయిటింగ్‌! దాంతో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆయన్ను వెతికే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబయ్, కొచ్చిలకు మనుషుల్ని పంపించి మామ ఎక్కడ ఉన్నాడో చూడమని చెప్పారట. ఎవరీ మామ? అంటే పవన్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న సినిమాలో ఓ క్యారెక్టర్‌ ఉందట! హీరోకు మామ వరసయ్యే ఆ పాత్రకు ఎవరు సూటవుతారోనని త్రివిక్రమ్‌ అండ్‌ కో తెగ వెతుకుతున్నారట.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటుల పేర్లను త్రివిక్రమ్‌కు కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ చెబుతున్నారట. ఆయన మనసులో మాత్రం మమ్ముట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. మరి, మమ్ముట్టి ఏమంటారో!! మామ పాత్రకు ఎవరూ సెట్‌ కాకపోవడం వల్లే షూటింగ్‌కు చిన్న గ్యాప్‌ ఇచ్చారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అన్నట్టు... ఈ సిన్మాలో ఖుష్బు పవన్‌కు అత్తగా నటిస్తున్నారనే ప్రచారం తెలిసిందే. అత్త భర్తే ఈ మామ అట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement