సా ఆర్‌ ఆర్‌ ఆర్‌.. గమ | Keeravani gives an update on Rajamouli RRR Movie | Sakshi
Sakshi News home page

సా ఆర్‌ ఆర్‌ ఆర్‌.. గమ

Mar 10 2019 12:26 AM | Updated on Mar 10 2019 12:26 AM

Keeravani gives an update on Rajamouli RRR Movie - Sakshi

కీరవాణి

సరిగమని తప్పుగా రాశాం అనుకోకండి. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. సరిగమ అంటూ.. బిజీగా ఉన్నారు చిత్రసంగీత దర్శకుడు కీరవాణి. అందుకే తమాషాగా సాఆర్‌ ఆర్‌ ఆర్‌.. గమ అన్నాం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయని కీరవాణి తెలిపారు. పీరియాడికల్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎలాంటి సంగీతాన్ని ప్రేక్షకులకు అందిస్తారో వేచి చూడాలి. ఆలియాభట్, ఓ బ్రిటిష్‌ మోడల్‌ హీరోయిన్లుగా నటించనున్నారని టాక్‌. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement