తెలంగాణ ఉద్యమంతో...

kcr biopic udyama simham trailer release - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవీ రెడ్డి, జలగం సుధీర్, లత, పీఆర్‌ విటల్‌ బాబు, సూర్య ముఖ్య పాత్రల్లో నటì ంచారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఉద్యమ సింహం’ సినిమా కేసీఆర్‌ జీవితకథ కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్‌ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. కేసీఆర్‌ పాత్రలో నటరాజన్‌ చక్కగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్‌గారు మాత్రమే పోరాడి తెలంగాణాను సాధించారు. ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని కృష్ణంరాజు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్‌ బండారి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top