కత్రినా హారతి.. నెటిజన్లు ఫైర్‌

Katrina Kaif Facing Trolls In Vinayaka Chavithi Celebrations At Salman Khan House - Sakshi

నేటి సోషల్‌ మీడియా కాలంలో సెలబ్రెటీలు ఏం చేసినా జాగ్రత్తగా చేయాల్సి వస్తోంది. ఏ మాత్రం తేడాగా అనిపించినా, కనిపించినా.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావల్సిందే. తాజాగా బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌.. తాను చేసిన ఓ పనితో ట్రోలింగ్‌ బారిన పడాల్సివచ్చింది. 

గురువారం నాడు వినాయక చవితిని సామాన్య జనంతో పాటు సెలబ్రెటీలు కూడా ఘనంగా జరుపుకున్నారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా స్టార్స్‌ అందరూ.. వినాయక చవితిని సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. అయితే బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంట్లో జరిపిన పూజా కార్యక్రమంలో కత్రినా చేసిన పనిని నెటిజన్లు పాయింట్‌ అవుట్‌ చేశారు. హారతిని రివర్స్‌గా ఇచ్చిందని కొందరు గుర్తించగా.. అక్కడున్న వారు కూడా గమనించి కత్రినాకు చెప్పలేదని ఇంకొందరు.. తనకు హారతి ఇవ్వడం తెలియదేమోనని మరికొందరు ఇలా రకరకాలుగా నెటిజన్స్‌ చేస్తోన్న కామెంట్స్‌తో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top