breaking news
vinakayaka Chavithi
-
నేడు పాఠశాలలకు సెలవు
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వినాయకచవితి వేడుకలు, ఓనం ఉత్సవాల నేపధ్యంలో పలు రాష్ట్రాలోని పాఠశాలలకు ఆగస్టు 28(గురువారం) సెలవు ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాతావరణ శాఖ కూడా పలు రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు చేసింది. దీనిని గమనించిన ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఏఏ రాష్ట్రాల్లో నేడు(గురువారం) సెలవు ప్రకటించారనే విషయానికొస్తే..పంజాబ్రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం నుంచి ఆగస్టు 31 పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను పొడిగించే అవకాశం కూడా ఉంది. రుతుపవనాలకు రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రంలోని రంజిత్ సాగర్, భాక్రా ఆనకట్టల నుండి నీటి విడుదల, సట్లూజ్, బియాస్, రావి వంటి నదులలో నీటి మట్టాలు పెరగడం కారణంగా పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి.ఉత్తరాఖండ్, జమ్ముజమ్మూలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 28న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.దక్షిణాదిన..దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గోవా, కేరళలలో గణేష్ చతుర్థిని ఆగస్టు 27న జరుపుకున్నారు. అయితే వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో 28న సెలవు ప్రకటించే అవకాశం ఉంది. కేరళలో ఓణం వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి.నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. -
ఈ గుడిలో ఎలుక రాజా చెవిలో చెబితే చాలు.. అన్ని శుభాలే!
భారతదేశంలో వినాయక చవితి (గణేష్ చతుర్థి 2025) వేడుకలను ఎంతో ఉత్సాహంగా, విశ్వాసంతో జరుపుకుంటారు. పది రోజుల పాటు, వాడవాడలా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజను నిర్వహించి నిమజ్జనంతో వీడ్కోలు పలుకుతారు. ఈ వేడుకల్లో అనేక మంటపాల్లో కొలువుదీరిన గణపతిలను సందర్శించుకోవడం ఆనవాయితీ. తమ కోర్కెలు తీర్చాలని మొక్కుకుంటారు. భక్తులు తమ కోరికలను రాసి, వినాయకుడికి పంపినా, ఎలుక చెవిలో చెప్పుకున్నా గణపయ్య కోరికలు తీరుస్తాడట. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది.గణేష్‌ను విఘ్నాలను హరించి, శుభాలను అందించే భావిస్తారు ఏ శుభ కార్యానికైనా తొలిపూజ ఆయనదే. మనదేశంలో ఒక్కో గణపతి ఆలయానికి ఒక్కో ప్రత్యేకత. అలాంటి వాటిలో ఒకటి రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఘర్ గణేష్ ఆలయం.ఘర్ గణేష్ ప్రత్యేకతఘర్ గణేష్ ఆలయంలో వినాయకుడిని తొండం లేకుండా, పురుషాకృతి రూపంలో బాలగణపయ్యగా ప్రతిష్టించారు. గణపతి బప్పా ఈ ప్రత్యేక రూపమే భక్తుల ఆకర్షణకు, భక్తికి ప్రత్యేక కారణంగా నిలుస్తోంది.300 ఏళ్ల చరిత్రఆలయ చరిత్ర 300 సంవత్సరాల పురాతనమైనదని చెబుతారు. 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జై సింగ్ II ఈ ఘర్ గణేష్ ఆలయాన్ని నిర్మించాడు. జైపూర్‌లో స్థిరపడటానికి ముందు అశ్వమేధ యాగం నిర్వహించినప్పుడు, ఈ ఆలయానికి పునాది వేశారని చెబుతారు. సిటీ ప్యాలెస్‌లోని చంద్ర మహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో కూడా చూడగలిగే విధంగా ఆయన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. భక్తులు తమ సమస్యలను ఎలుకల చెవుల్లో చెబుతారు.ఘర్ గణేష్ ఆలయం దాని ప్రాచీనతకు మాత్రమే కాదు, ప్రత్యేకమైన పూజా పద్ధతికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణేశుడితో పాటు, ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో రెండు భారీ గణేషుడి వాహనమైన మూషికాలు(ఎలుకలు) ఏర్పాటు చేశారు. భక్తులు తమ సమస్యలను, కోరికలను వీటి చెవుల్లో నెమ్మదిగా చెప్పుకుంటారు. ఆ మూషికా రాజాలు నేరుగా బప్పాకు తెలియజేస్తే, గణేశుడు వారి కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు.చదవండి: దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమాలేఖ రాయడం ద్వారా కూడాఘర్ గణేష్ ఆలయం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భక్తులు లేఖ లేదా ఆహ్వాన పత్రిక రాయడం ద్వారా తమ కోరికలను పంపుతారు. ఇంట్లో పెళ్లి అయినా, బిడ్డ పుట్టినా, ఉద్యోగం వచ్చినా, ఇలా ఏ శుభకార్యమైనా దానికి సంబంధించిన ఆహ్వానాన్ని పంపుతారు. అలా ప్రతిరోజూ వందలాది ఉత్తరాలు ఈ ఆలయ చిరునామాకు వస్తాయి, వాటిని చదివి భగవంతుని పాదాల వద్ద ఉంచుతారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. గణేష్ జీ వారి ప్రతి పిలుపు విని, శుభాలనిస్తాడని భక్తుల విశ్వాసం. (పూజా కంకణం ప్రాశస్త్యం, వినాయక విగ్రహం చెప్పే నీతి)365 మెట్లు ఎక్కాలిఆలయానికి చేరుకోవడానికి, భక్తులు 365 మెట్లు ఎక్కాలి, ఇది సంవత్సరంలో 365 రోజులకు ప్రతీక. ఇక్కడి నుంచి మొత్తం జైపూర్ నగరం విశాల దృశ్యం కనిపిస్తుంది, ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఈ దృశ్యం కళ్ళారా చూడాల్సిందే. జైపూర్‌లో తప్పకుండా సందర్శించాల్సిన విశేషాల్లో ఇది కూడా ఒకటి. -
గణపతి బప్పా 'మోరియా' వెనుక కథలేంటో తెలుసా?
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలకు సన్నద్ధమవుతోంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా సంబరమే. తొమ్మిరోజుల పాటు గణేష్మంటపాల్లో ఊరా, వాడా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు మారు మోగుతాయి. భజనలు కీర్తనల, భక్తిగీతాలతోగణనాయకుడ్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. విజయాలనీయవయ్యా విఘ్నరాజా అని వేడుకొంటారు.అయితే గణపతి బప్పా మోరియా అనే నినాదం ఎలా వచ్చిందో తెలుసా.అయితే ఈ నినాదంలో మోరియా అనే పదం నినాదంలా ఎలా మారింది. అసలు దీనికి అర్ధం ఏంటి.. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా మోరియా.. మంగల్ మూర్తి మోరియా అనే నినాదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారంటే..15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. మహారాష్ట్రాలోని పుణెకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు.మోరియా గోసావి 117 సంవత్సరాల వయస్సు వరకు క్రమం తప్పకుండా మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాడు. అయితే వయోభారం కారణంగా ఆయన ఆలయానికి వెళ్లలేకపోకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారట.అయితే మోరియా నిద్రపోతున్న సమయంలో స్వయంగా ఈ విఘ్న నాయకుడు కలలో కనిపించి.. అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని..దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. అలా మోరియా నదికి వెళ్లగా. అక్కడొక వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయంలో గ్రామంలో అందరికీ తెలిసింది. దీంతో సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపించిన మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అంటే.. గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. అలా ’గణపతి బప్పా మోరియా’ అనే నినాదం కొనసాగుతోందని చెబుతారు. తనివితీరా గణపతి బప్పా మోరియా అని మొక్కితే సర్వ విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం.పురాణ గాథమహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది. పుణెకు 79 కిలోమీటర్ల దూరంలో బారమతీ తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర. పిల్లలు లేనందువల్ల శౌనక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది. సూర్యుడిని మించిన వేడి పిల్లవాడు జన్మించడంతో అతడిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో దొరికిన కారణంగా అతడు సముద్ర లేదా సింధురాసురుడగా ప్రసిద్ధికెక్కాడు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం చేసిన తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదించాడనీ, దీంతో సింధుకు మృత్యుభయం ఉండదని చెబుతారు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడట. ఈ అహంకారంతో దేవతలపైనా, కైలాసం, వైకుంఠంపైనా దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహా విష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసురుడు ప్రకటించాడు. దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై.. తాను పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని అంతమొందిస్తానని వారితో చెప్పాడట. పన్నెండేండ్లు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి కొడుకుగాపుట్టాడట. ఒకసారి సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. ‘మోర్’ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకొని వచ్చి సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని.. అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు కొలుస్తుంటారు. అలా క్రమంగా ‘గణపతి బప్పా మోరియా’గా ప్రసిద్ధికెక్కింది. ఈ కథను చెప్పేవారికి, విన్నవారికి సమస్త కోరికలు ఫలిస్తాయనిధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుందని పండితుల ఉవాచ.నోట్ : అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రం. ఇది భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు మీద ఆధారపడి ఉంటాయనేది గమనించాలి. -
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
-
వినాయక చవితి వేడుకల్లో స్టార్ హీరో డ్యాన్స్.. వీడియో వైరల్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముంబయిలో సందడి చేశారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చిన్నపిల్లలతో కలిసి డప్పుల ముందు చిందులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. ఇటీవల పక్కటెముకల గాయంతో ఓ ఈవెంట్లో ఇబ్బంది పడుతూ కనిపించారు. మరోవైపు హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.గాయంతో ఈవెంట్‌కు హాజరు..ఈ బిగ్‌బాస్ ఈవెంట్లోనూ తాను ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్‌గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు. Happy Ganesh Chaturthi pic.twitter.com/Ac7d9Om86v— Salman Khan (@BeingSalmanKhan) September 9, 2024 -
గణనాయకుడు ఎలా అయ్యాడు? నవరాత్రులు ఎందుకు చేస్తారు?
వినాయకచతుర్థి రోజు అందరూ పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి పట్టు వస్త్రాలు లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకొని, మండపాన్ని ఏర్పరచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేసి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, స్వామికి ఇష్టమైన కుడుములు, అపూపాలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పాయసం, పానకం, వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి, వ్రతకథను చదువుకొని, కథాక్షతలని శిరస్సున ధరించి, బ్రాహ్మణులను సత్కరించి, ఆనందంతో అందరూ కలసి ప్రసాదాలని స్వీకరించి, గణేశ భజనలతో, కీర్తనలతో, పురాణశ్రవణంతో ఆయన మీదే మనసు లగ్నం చేసి, ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండగను మనం జరుపుకుంటాం. నేడు వినాయక చవితి సందర్భంగా ఈ పండుగ ప్రాధాన్యతను, వినాయకుని విశిష్టతను మరోసారి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలనకు అవతరించి మంగళస్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు. గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలంనుండి ఆరాధనలందుకుంటున్న దైవం, వేదాలలో స్తుతించబడి, గణాలకు అధిపతియై, శబ్దాలకు రాజుగా, ప్రణవ స్వరూపుడై శబ్దబ్రహ్మగా ‘గ’ శబ్దం బుద్ధికి ‘ణ’ శబ్దం జ్ఞానానికి ప్రతీక. సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా ‘గణపత్యధర్వ శీర్షం’లో వర్ణించారు. గణాలంటే అక్షరాలతో ఏర్పడే ఛందస్సు – గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి ‘. అంతేకాకుండా ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు. సృష్టి ఆదిలో దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాధ, దీనిలో అంతరార్థం ఏమిటంటే మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –ఆ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారం వద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి. గణనాయకుడు ఎలా అయ్యాడు? వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్రవర్ణుడు. తల్లిదండ్రులు పూజ్యులని వారిని సేవిస్తే పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చాటి చెప్పడంతో విఘ్నాధిపత్యం వహించి గణాలను నాయకుడయ్యాడు. అలా వినాయకుడు గణనాయకుడయ్యాడు. వినాయకుని ఆసనంలో గల అంతరార్థం: తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు! ఆయన భంగిమలను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. కర్మయోగులకు ఈ రెండూ అవసరమే కదా! ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు. గణపతి నవరాత్రులు ఎందుకు? భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది. గుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి, సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోంది. కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే, పదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం. తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు. తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు! శాస్త్రీయంగా ఇది నిజమే. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది. --డి వి ఆర్ భాస్కర్ (చదవండి: వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!) -
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
-
సత్యప్రమాణాల దేవుడికి బ్రహ్మోత్సవాలు
దేశంలోని గణపతి క్షేత్రాల్లో కాణిపాకం ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా వెలసింది. ఇక్కడ వెలసిన గణపతి సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. బాహుదా నదీతీరంలోని ఈ స్థలపురాణానికి సంబంధించి ఒక గాథ ప్రచారంలో ఉంది. బాహుదా నదీతీరాన విహారపురంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు అంధుడు, ఇంకొకరు మూగవాడు, మరొకరు బధిరుడు. వారికి ‘కాణి’ భూమి ఉండేది. ‘కాణి’ అంటే, పావు ఎకరం. అందులోనే వాళ్లు వ్యవసాయం చేసుకునేవాళ్లు. ఒకసారి కరవు వచ్చి, ఆ భూమిలోని బావి ఎండిపోయింది. నీటికోసం ఆ బావిని మరింత లోతుగా తవ్వేందుకు ముగ్గురు అన్నదమ్ములూ పలుగు పారలు తీసుకుని, అందులోకి దిగారు. తవ్వుతూ ఉండగా, ఇసుకపొరలో రాయి అడ్డు వచ్చింది. దానిపై పలుగుపోటు పడగానే, దాని నుంచి నెత్తురు చిమ్మింది. ఆ రక్తస్పర్శతో ముగ్గురు అన్నదమ్ముల వైకల్యాలూ తొలగిపోయాయి. వారి ద్వారా సంగతి తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని, బావిలోని ఇసుక తొలగించారు. అందులో వినాయక విగ్రహం దొరికింది. అలా ఇక్కడ స్వయంభువుగా వెలసిన గణపతిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల జనం తండోపతండాలుగా వచ్చారు. వారు కొట్టిన టెంకాయల నీటితో ‘కాణి’ విస్తీర్ణం ఉన్న పొలమంతా తడిసిపోయింది. ‘కాణి’ నేలలో నీరు పారినందున తమిళంలో దీనికి ‘కాణిపారకం’– (‘పారకం’ అంటే ప్రవహించడం) అనే పేరు వచ్చింది. కాలక్రమేణా జనుల నోట ఈ పేరు కాణిపాకంగా మారింది. ఇదీ చరిత్ర కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. మొదటి కుళోత్తుంగ చోళుడు పదకొండో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో విజయనగర రాజులు దీనిని మరింతగా అభివృద్ధిపరచారు. ఈ క్షేత్రంలో చోళ, పాండ్య, గంగవంశ రాజులు వేయించిన శాసనాలు బయటపడ్డాయి. కాణిపాకం వినాయక ఆలయ ప్రాంగణంలోనే వరదరాజ, మణికంఠేశ్వర, వీరాంజనేయ ఉపాలయాలు ఉన్నాయి. ముప్పయ్యేళ్లుగా ఈ ఆలయంలో భక్తులకు నిత్యాన్నదానం జరుగుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో వివాహం చేసుకోవడం శుభకరమని భక్తుల విశ్వాసం. ఇటీవలి కాలంలో ఇక్కడ వివాహాలు పెరుగుతున్నందున, దేవస్థానం నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఏడు కళ్యాణ మండపాలను నిర్మించారు. (క్లిక్: అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా జరపుకోవాలి!) వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకునికి ఏటా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత పన్నెండు రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని తర్వాత కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకునికి మాత్రమే స్వర్ణరథం ఉంది. -
గణపతి పూజాలో కత్రినా.. నెటిజన్లు ఫైర్
-
కత్రినా హారతి.. నెటిజన్లు ఫైర్
నేటి సోషల్ మీడియా కాలంలో సెలబ్రెటీలు ఏం చేసినా జాగ్రత్తగా చేయాల్సి వస్తోంది. ఏ మాత్రం తేడాగా అనిపించినా, కనిపించినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావల్సిందే. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్.. తాను చేసిన ఓ పనితో ట్రోలింగ్ బారిన పడాల్సివచ్చింది. గురువారం నాడు వినాయక చవితిని సామాన్య జనంతో పాటు సెలబ్రెటీలు కూడా ఘనంగా జరుపుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా స్టార్స్ అందరూ.. వినాయక చవితిని సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిపిన పూజా కార్యక్రమంలో కత్రినా చేసిన పనిని నెటిజన్లు పాయింట్ అవుట్ చేశారు. హారతిని రివర్స్‌గా ఇచ్చిందని కొందరు గుర్తించగా.. అక్కడున్న వారు కూడా గమనించి కత్రినాకు చెప్పలేదని ఇంకొందరు.. తనకు హారతి ఇవ్వడం తెలియదేమోనని మరికొందరు ఇలా రకరకాలుగా నెటిజన్స్ చేస్తోన్న కామెంట్స్‌తో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
విఘ్నేశా.. వీడ్కోలు
* కన్నుల పండువగా సాగిన నిమ‘జ్జన’ ఘట్టం * తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఉత్సవం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారి ఉత్సవం.. అరవై అడుగుల మహా విశ్వరూప గణ(ఘన)పతి.. తదితర ప్రత్యేకతల నేపథ్యంలో, పదకొండు రోజుల పాటు అశేష భక్తజనుల విశేష పూజల అనంతరం సామూహిక గణేశ్ నిమజ్జనయాత్ర సరికొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. సోమవారం జరిగిన శోభాయాత్ర కన్నుల పండువలా ముందుకు సాగింది. భక్తజనం ముక్తకంఠంతో ‘జైబోలో గణేశ్ మహరాజ్’ అంటూ బాలాపూర్ నుంచి వినాయకసాగర్ వరకు నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్ర సరికొత్త అందాన్ని చిత్రించింది. మునుపటిలా ఉరుకులు పరుగులు లేకుండా యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. నెమ్మదిగా ముందుకు సాగింది. దీంతో, సాయంత్రం ఆరుగంటల వరకూ వినాయకసాగర్‌కు చెప్పుకోదగ్గ సంఖ్యలో గణనాథులు రాలేదు. ప్రపంచం లోనే అతి పెద్ద వినాయకునిగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణపయ్యపై ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురుస్తుందని ప్రకటించడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు ఎందరో ఎదురు చూశారు. దాంతో పాటు భారీ వినాయకుణ్ని మళ్లీ చూడలేమనే తలంపుతో ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు జనం పోటెత్తారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన దృశ్యాల్ని తిలకించేందుకు నేల ఈనిందా.. అన్నట్లు ప్రజలు భారీగా అక్కడకు చేరుకున్నారు. బహు రూపాల్లో బొజ్జ గణపయ్యలు విభిన్న రూపాల్లోని గణేశుడి ప్రతిమలు.. పండ్లు, పూలతో అలంకరించిన నిమజ్జన వాహనాలు.. యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పహిల్వాన్ ఆకృతిలోని వినాయకునితోపాటు బాలాజీ, షిర్డీ సాయిబాబా, పార్వతీపరమేశ్వరులతో కూడిన ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. డీజే సంగీతానికి అనుగుణంగా యువతీ యువకులు చేసిన నృత్యాలు శోభాయాత్రలో ఉత్సాహం నింపాయి. నిమజ్జనయాత్రలోని ముఖ్యకేంద్రమైన మొజాంజాహీ మార్కెట్‌కు శోభాయాత్ర చేరుకునేటప్పటికి దాదాపు రాత్రి 7 గంటలైంది. దాంతో విగ్రహాలు వినాయకసాగర్‌కు వచ్చేందుకు మరింత సమయం పట్టింది. వివిధ మార్గాల నుంచి.. నగరంలోని వివిధ మార్గాల నుంచి బయల్దేరిన వినాయకుల విగ్రహాలు కూడా రాత్రి 8 గంటల తర్వాతే హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నాయి. ‘గణపతి బొప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై..’ తదితర నినాదాలతోపాటు బాజా భజంత్రీలు, మేళతాళాలు, కళాకారుల నృత్యాలతో నగర వీధులన్నీ పండుగ హోరులో మునిగాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆయా ప్రాంతాల్లో వేదికలపై నుంచి పూల తో గణనాయకులకు స్వాగతం పలికారు. పలుచోట్ల భక్తులకు మంచినీరు, ప్రసాదం పంపిణీ చేశారు. ఆయాప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే యాత్ర వేగంగా ముందుకు సాగింది. పలు ప్రాంతాల్లో నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌తోపాటు కాప్రా చెరువు, సరూర్‌నగర్ చెరువు, రాజన్నబావి, మీరాలంట్యాంక్, పల్లె చెరువు, పత్తికుంట చెరువు, దుర్గం చెరువు, మల్కం చెరువు, గోపీనగర్ చెరువు, పెద్ద చెరువు(గంగారం), గురునాథం చెరువు (జేపీనగర్), కైదమ్మకుంట (హఫీజ్‌పేట), ఈర్ల చెరువు, రాయసముద్రం చెరువు (రామచంద్రాపురం), సాకి చెరువు (పటాన్చెరు), ఐడీఎల్ ట్యాంక్ 16, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పేట చెరువు, సున్నం చెరువు, పరికి చెరువు, వెన్నెలగడ్డ చెరువు, సూరారం చెరువు, కొత్తచెరువు (అల్వాల్‌లేక్), సఫిల్‌గూడ చెరువుల వద్ద కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ నుంచి.. నిమజ్జనం తీరును హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లు హెలికాప్టర్ నుంచి వీక్షించారు. నిమజ్జన యాత్ర మార్గాల్ని వీక్షించిన వారు పరిస్థితి ప్రశాంతంగా ఉందని రూఢి చేసుకున్నారు. అపశ్రుతి.. భక్తియాత్ర సజావుగానే సాగినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. గణేశునిపై పూలవర్షం కురిపిస్తారని తెలిసి ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకని రాయదుర్గం నుంచి ఆటోలో బయలుదేరిన కుటుంబం ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొనడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అఫ్జల్‌గంజ్ నుంచి నిమజ్జనానికి బయలుదేరిన ట్రాలీఆటో మొజాంజాహీ మార్కెట్ వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. ఆటోలో మొత్తం 15 మంది ఉండగా, వారిలోఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గణనాథుడిని వాహనంలో ఎక్కిస్తుండగా గోషామహాల్ ప్రాంతానికి చెందిన సాయి(25) అనే వ్యక్తి చూపుడు వేలు తెగిపోయింది. మరో ఘటనలో గణపతిని వాహనంలోకి ఎక్కిస్తుండగా, అదుపుతప్పి కిందపడి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇసుకేస్తే రాలనంతగా.. ఈ సంవత్సరం అత్యంత ఎత్తుకు ఎదిగిన గణనాథుడు వచ్చే ఏడాది నుంచి ఎత్తు తగ్గనుండటంతో గ్రేటర్ ప్రజలే కాక పొరుగుజిల్లాల నుంచీ భారీసంఖ్యలో ప్రజలు నగరానికి చేరుకున్నారు. దాదాపు 15 లక్షల మంది ఈ అపురూప వేడుకను తిలకించినట్లు అంచనా. మొజాంజాహీ మార్కెట్, ట్యాంక్బండ్లు ఇసుకేస్తే రాలని జనాన్ని తలపిస్తూ మహోత్సవానికి ప్రత్యక్షసాక్షులుగా నిలిచాయి. యాత్ర సాగిందిలా.. బాలాపూర్‌లో వేలంపాట అనంతరం ఉదయం 11.15 గంటలకు గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా.. అడుగడుగునా నృత్యాలు.. డప్పుమోతలు.. కేరింత లతో పండుగ సంబరంతో గణనాథుల రథాలు ముందుకు కదిలాయి. పాతబస్తీ పరిధిలోని విగ్రహాలు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బయల్దేరి చార్మినార్‌కు చేరుకునేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ విగ్రహం బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, అలియాబాద్, లాల్‌దర్వాజ, శాలిబండ మీదుగా చార్మినార్‌కు చేరుకునే సరికి సాయంత్రం 6.30 గంటలు దాటింది. అడుగడుగునా నిఘా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, తదితర ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయడంతో యాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఊరేగింపులో గణేశ ప్రతివులు కలిసే చోట పోలీసులు అప్రవుత్తంగా వ్యవహరించారు. యాత్ర పొడవునా వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏ మార్గంలోనైతే పరిస్థితి విషమంగా మారనుందో ముందస్తుగానే గుర్తించి, ట్రాఫిక్‌ను మళ్లించే చర్యలు చేపట్టడంతో యాత్ర సజావుగా ముందుకు సాగింది. 11న ప్రసాదం పంపిణీ 2 వేల కిలోలు లడ్డూ దాతకు.. 3 వేల కిలోలు భక్తులకు హైదరాబాద్: కైలాస విశ్వరూప మహాగణపతికి నైవేద్యంగా సమర్పించిన 5 టన్నుల బరువైన భారీ లడ్డూను ఈ నెల 11న భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సోమవారం రాత్రి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ లడ్డూలో రెండు వేల కిలోల్ని దాత (తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు)కు అందజేయనున్నారు. మిగిలిన 3 వేల కిలోల ప్రసాదాన్ని భక్తులకు పంచనున్నారు. పల్లెల్లో పంచుతా... మహాగణపతికి ప్రసాదాన్ని అందించే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు కేటాయించిన రెండు వేల కిలోల లడ్డూను 50 నుంచి 60 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా తయారు చేస్తా. మా జిల్లాలోని(తూర్పుగోదావరి) వివిధ గ్రామాల్లో భక్తులకు పంపిణీ చేస్తా. -లడ్డూ దాత మల్లిబాబు -
గంగమ్మ ఒడిలోకి గణనాథులు