‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా..’ | Karthi Dev Movie Teaser Released | Sakshi
Sakshi News home page

Nov 5 2018 2:04 PM | Updated on Jul 23 2019 11:50 AM

Karthi Dev Movie Teaser Released - Sakshi

ఖాకీ చిత్రంతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన కార్తీ, రకుల్‌ ప్రీత్‌ల తాజా చిత్రం ‘దేవ్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి కానుకగా ఈరోజు(సోమవారం) చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. లవ్‌.. యాక్షన్‌.. రొమాన్స్‌ సీన్స్‌తో కూడిన ఈ టీజర్‌ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి.. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి.. ఇష్టం లేని ఉద్యోగం చేసి.. ముక్కు మొహం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి.. ఈగో, ప్రెషర్.. కాంపిటేషన్లో ఇరుక్కుని.. అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఓ దారి. ఇంకోదారి ఉంది..’  అంటూ కార్తీ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ సాగింది. చివర్లో ‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా..’  కార్తీ తన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నాడు. టీజర్‌లో కార్తీ చాలా స్టైలిష్‌గా కనిపించారు.

త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని దర్శకుడు రజత్‌ రవిశంకర్‌ తెరకెక్కిస్తున్నారు. హారిస్‌ జయరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement