‘కర్తవ్యం’ మూవీ రివ్యూ

Karthavyam Movie Review - Sakshi

టైటిల్ : కర్తవ్యం
జానర్ : ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : నయనతార, సును లక్ష్మీ, విఘ్నేష్‌, ఆనంద్‌ కృష్ణన్‌
సంగీతం : గిబ్రాన్‌
దర్శకత్వం : గోపీ నైనర్‌
నిర్మాత : శరత్‌ మరార్‌, ఆర్‌.రవీంద్రన్‌

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న నయనతార లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన తమిళ సినిమా ఆరమ్‌. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో కర్తవ్యం పేరుతో (సాక్షి రివ్యూస్‌) డబ్ చేసి రిలీజ్‌ చేశారు. నయనతార కలెక్టర్‌ పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రివ్యూ షోస్‌తోనే పాజిటివ్‌ టాక్‌ రావటంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రొటీన్‌ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన కర్తవ్యం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? నయనతార లేడీ సూపర్‌ స్టార్‌గా తన హవాను కొనసాగించిందా..?

కథ :
కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని కలెక్టర్‌ మధువర్షిణి(నయనతార). నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మధువర్షిణి అక్కడి నీటి సమస్యను ఎలాగైన పరిష్కరించాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో ధన్సిక అనే నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడుతుంది. (సాక్షి రివ్యూస్‌) ఆ పాపను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రంగా ప్రయత్నించినా అక్కడి పరిస్థితుల కారణంగా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మధువర్షిణి ప్రభుత్వ పరంగా చేసిన ప్రయత్నాలన్ని  విఫలం కావటం‍తో చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంది..?  ఆ చిన్నారి ప్రాణాలు ఎలా కాపాడింది? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
పూర్తిగా తమిళ నేటివిటితో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక్క నయనతార (సాక్షి రివ్యూస్‌) మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. సినిమా పూర్తిగా నయనతార పాత్ర చుట్టూ నడవటంతో ఎక్కడా మనకు డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న భావన కలుగదు. నయనతార తనదైన నటనతో సిన్సియర్‌ కలెక్టర్‌ పాత్రకు ప్రాణం పోసింది. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో మధువర్షిణి పాత్రలో జీవించింది. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు సహజంగా నటించారు. కొత్తవారే అయినా ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించి మెప్పించారు.(సాక్షి రివ్యూస్‌)

విశ్లేషణ :
గ్రామీణ ప్రాంతాల్లో నీటికోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ఎంచుకున్న దర్శకుడు గోపి నైనర్‌ ఆ కథకు కంటతడి పెట్టించే ఎమోషన్స్‌ జోడించి సినిమాను నడిపించాడు. అనవసరమైన కామెడీ, కమర్షియల్ సన్నివేశాలను ఇరికించకుండా (సాక్షి రివ్యూస్‌) సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఎక్కడా సినిమా చూస్తున్న భావన కలగకుండా నిజంగా జరిగిన సంఘటనను  చూస్తున్నామనిపించేలా సాగింది కథనం. (సాక్షి రివ్యూస్‌) ఒక పక్క అంతరిక్షంలోకి రాకెట్‌ లను పంపుతున్నా వంద అడుగుల బావిలో పడ్డ పాపను కాపాడేందుకు  సరైన పరిజ్ఞానం లేని పరిస్థితులను ఆలోచింప చేసే విధంగా ఎత్తి చూపించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం, రాజకీయనాయకులు తప్పులను కూడా ఎత్తి చూపించారు. జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు, ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువుల బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నయనతార నటన
ఎమోషనల్‌ సీన్స్‌
కథా కథనం

మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవటం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top