కరణ్‌కి కుచ్‌ కుచ్‌ హోతా హై

Karan Johar Is First Bollywood Filmmaker To Get Wax Statue At Madame Tussauds - Sakshi

‘కుచ్‌ కుచ్‌ హోతా హై’.. ఇది కరణ్‌ జోహార్‌ డైరెక్టర్‌ చేసిన తొలి మూవీ. ఆ సినిమా చాలామంది మనసుల్లో ఏదో ఏదో జరిగేలా చేసింది. తీయని అనుభూతిని మిగిల్చింది. ఇప్పుడు కరణ్‌ జోహర్‌ మనసులో కూడా కుచ్‌ కుచ్‌ హోతా హై. ఎందుకంటే.. డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌గా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కరణ్‌ తర్వాత డైరెక్టర్‌గా బీటౌన్‌లో సక్సెస్‌ అయ్యారు. ధర్మ ప్రొడక్షన్స్‌పై ఎన్నో బిగ్గెస్ట్‌ మూవీస్‌ను నిర్మించడమే కాదు సూపర్‌హిట్స్‌ అందుకున్నారు. దర్శక–నిర్మాతగా కరణ్‌ జోహార్‌కి ఉన్న సక్సెస్‌ఫుల్‌ ట్రాక్‌ ఆయన్ను మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియమ్‌ వరకూ తీసుకెళ్లింది.

లండన్‌ మేడమ్‌ తుస్సాడ్స్‌లో కొన్ని రోజుల్లో ఆయన మైనపు బొమ్మ దర్శనమివ్వనుంది. ఈ విషయాన్ని కరణ్‌ సోషల్‌మీడియా ద్వారా షేర్‌ చేశారు ‘‘మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ ఫిల్మ్‌ మేకర్‌ని నేనే కావడం ఆనందంగా ఉంది. నా బొమ్మ తయారీ కోసం కొలతలు తీసుకున్నారు. నా విగ్రహం కోసం వర్క్‌ చేస్తున్న లండన్‌ టీమ్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు కరణ్‌ జోహార్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలను  హిందీలో కరణ్‌ జోహార్‌ రిలీజ్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top