చిన్న సినిమాల విడుదల కష్టం

Kannullo Nee Roopame Audio Success Meet - Sakshi

నందు, తేజస్విని ప్రకాశ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. బిక్స్‌ ఇరుసడ్ల దర్శకత్వంలో ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్‌ భాసాని నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. సాకేత్‌ స్వరపరచిన పాటలకి మంచి స్పందన రావటంతో హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ముఖ్య అతిథి నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో చిన్న చిత్రాలను విడుదల చేయటం చాలా కష్టం. బిక్స్‌గారు ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు.

ఈ సినిమా మంచి విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘బిక్స్‌గారు నాకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం. తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకునిలా తెరకెక్కించారు. నా మొదటి సినిమా ‘కన్నుల్లో నీ రూపమే’ ఆడియో సక్సెస్‌ మీట్‌ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సాకేత్‌. ‘‘మా సినిమా విడుదలకు సహాయం చేస్తున్న ఇప్పిలి రామమోహన్‌రావు, ఎస్‌. శ్రీకాంత్‌రెడ్డిగార్లకు ధన్యవాదాలు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు బిక్స్‌. చిత్ర నిర్మాత భాస్కర్‌ భాసాని, హరిహర చలనచిత్ర నిర్మాత ఇప్పిలి రామమోహన్‌ రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top