‘మణికర్ణిక’ ఆగమనం అప్పుడే..!

Kangana Ranaut Manikarnika Release Date - Sakshi

టాలీవుడ్ డైరెక్టర్‌ క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ సమకూర్చారు.

మార్చిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్‌ డే సందర్భంగా 2019 జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాల్సి రావటం, గ్రాఫిక్స్ వర్క్‌కూడా భారీగా ఉండటంతో నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయట. అందుకే సినిమా రిలీజ్‌ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

సంబంధిత కథనాలు..
రీ-షూట్‌ కోసం ఐదు కోట్ల ఖర్చు...!
గుమ్మడికాయ కొట్టేశారు
మణికర్ణికలో కంగనా లుక్‌..

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top