గురువుతో శిష్యుడు | Kanchana 3 First Look Will Be Out On Petta Release Date | Sakshi
Sakshi News home page

Dec 23 2018 11:07 AM | Updated on Dec 23 2018 11:07 AM

Kanchana 3 First Look Will Be Out On Petta Release Date - Sakshi

గురువుతో పాటు శిష్యుడు ఆటపాటలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌కు మధ్య ఉన్న గురుశిష్యుల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాఘవ లారెన్స్‌ను డాన్సర్‌గా సిఫార్సు చేసింది రజనీకాంత్‌నేనన్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం పేట్ట పొంగల్‌కు భారీ ఎత్తున తెరపైకి రానుంది. అదే రోజున లారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కాంచన 3 చిత్ర గీతాలను విడుదల చేయనున్నారు.

లారెన్స్‌ ఇంతకు ముందు హీరోగా నటించి, తెరకెక్కించిన కాంచన–1, కాంచన–2 చిత్రాలు హర్రర్, కామెడీ బ్యానర్‌లో రూపొంది మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో వాటికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న చిత్రం కాంచన –3. ఈ చిత్రం పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి విడుదల తేదీ ఇప్పుడు ఖరారైంది. లారెన్స్‌కు జంటగా నటి ఓవియ, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

తుది ఘట్ట సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. లారెన్స్‌నే నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ కాంచన–3 చిత్ర విడుదల హక్కులను తాజాగా సన్‌ పిక్చర్స్‌ సంస్థ పొందింది. పేట చిత్రం ఈ సంస్థ నుంచే వస్తున్న విషయం తెలిసిందే. పేట చిత్ర విడుదలతో కాంచన–3 చిత్ర గీతాలను, చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ నెలలోనూ విడుదల చేయడానికి సన్‌ పిక్చర్స్‌ సంస్థ సన్నాహాలు చేస్తోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement