'దృశ్యం' కోసం.. భాష నేర్చుకుంటున్న కమల్ | Sakshi
Sakshi News home page

'దృశ్యం' కోసం.. భాష నేర్చుకుంటున్న కమల్

Published Sat, Sep 6 2014 12:05 PM

'దృశ్యం' కోసం.. భాష నేర్చుకుంటున్న కమల్ - Sakshi

నటన విషయంలో తాను నిత్య విద్యార్థినని చెప్పుకొంటుంటారు సకల కళా వల్లభుడు కమల్ హాసన్. ఆ విషయం ఏదో చెప్పి ఊరుకోవడం వేరు.. నిజంగా ఆచరించడం వేరు. అలా ఆచరించేవాళ్లలో ముందుంటారు కమల్. ఇప్పుడు తాను తాజాగా నటిస్తున్న 'దృశ్యం' తమిళ రీమేక్ 'పాపనాశం' కోసం ఇప్పుడు కొత్తగా తిరునల్వేలి యాసను ఆయన నేర్చుకుంటున్నారు.

మళయాళం, కన్నడ, తెలుగు భాషల్లో హిట్టయిన దృశ్యం సినిమాను తమిళంలో కమల్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొంత భాగంలో కమల్ హాసన్ తిరునల్వేలి యాస మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తన సినిమాల్లో ఎప్పుడూ ఈ యాస మాట్లాడలేదు. దాంతో.. ఇప్పుడు కొత్తగా రచయిత సుగ దగ్గర ఆ యాసలో శిక్షణ పొందుతున్నాడని మరో రచయిత జయమోహన్ తెలిపారు. ఈ సినిమాకు డైలాగులు రాసింది జయమోహనే. ఈ సినిమాలో.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ గౌతమి నటిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement