‘నా నువ్వే’ రన్‌ టైం ఫిక్స్‌ | Kalyan Ram Naa Nuvve Run Time Locked | Sakshi
Sakshi News home page

May 12 2018 1:43 PM | Updated on May 12 2018 4:27 PM

Kalyan Ram Naa Nuvve Run Time Locked - Sakshi

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్‌ కోనేరు, విజయ్‌ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రన్‌ టైం షార్ట్‌ అండ్‌ క్రిస్ప్‌గా ఉండనుంది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో భారీ నిడివితో చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. రంగస్థలం, భరత్‌ అనే నేను, నా పేరు సూర్య, మహానటి ఇలా అన్ని సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో రిలీజ్‌ అయ్యాయి.

అయితే నా నువ్వే నిడివి మాత్రం రెండు గంటల లోపే ఉండనుంది. కేవలం 118 నిమిషాల రన్‌టైంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షరత్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆడియోను ఇటీవల రిలీజ్ చేశారు. సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement