లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కాజోల్‌ | Kajol to play a single mother in next | Sakshi
Sakshi News home page

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కాజోల్‌

Nov 2 2017 1:54 PM | Updated on Nov 2 2017 1:54 PM

Kajol to play a single mother in next - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రాణీ ముఖర్జీ, ఐశ్వర్యా రాయ్‌, శ్రీదేవి లాంటివారు  ఈ తరహా చిత్రాల్లో అలరించే ప్రయత్నం చేయగా తాజాగా మరో సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌ కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు  రెడీ అవుతోంది. పెళ్లి తరువాత కొంత కాలం వెండితెరకు దూరంగా ఉన్న కాజోల్‌ లాంగ్‌గ్యాప్‌ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి సెలెక్టివ్‌ గా సినిమాలు చేస్తోంది.

ఇటీవల తమిళ సినిమా వీఐపీ 2లో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌ సినిమాలో ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించనుంది. ఎలాంటి ఆధారం లేని తల్లి పాత్రలో నటించేందుకు కాజోల్‌ అంగీకరించింది. ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాజోల్‌ భర్త, బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం కాజోల్‌ కొడుకు పాత్ర కోసం బాలనటుడ్ని వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement