శివరాత్రి వేడుకలు.. కాజల్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Kajal And Tamannaah Dances At Maha Shivratri Celebrations - Sakshi

చెన్నై : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్‌ శివరాత్రి పర్వదినం సందర్భంగా కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో సోమవారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు సౌత్‌ ఇండస్ట్రీ టాప్‌ హీరోయిన్‌లు కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, అదితిరావు హైదరిలతో పాటు రానా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్‌ మహాశివరాత్రి విశిష్టత గురించి ప్రసంగించారు. అనంతరం శివరాత్రి జాగరణలో భాగంగా రాత్రంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ వేడుకల్లో కాజల్‌, ఆమె సోదరి నిషా అగర్వాల్‌‌, తమన్నా, వాసుదేవ్‌ కలిసి డ్యాన్స్‌ చేశారు. వారంతా డ్యాన్స్ చేస్తున్న‌ వీడియోను కాజల్‌ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్‌ అవుతోంది. ప్రముఖ గాయకుడు కార్తిక్‌ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా హాజరయ్యారు. కొద్దిసేపు వాసుదేవ్‌తో మాట్లాడి ఆయన వెళ్లిపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top