వంట చేయడం భలే సరదా

kajal agarwal relaxed for cooking - Sakshi

ఖాళీ సమయాల్లో ఒక్కొక్కరికీ ఒక్కో హాబీ ఉంటుంది. కొందరు పుస్తకాలు చదువుతారు. మరికొందరు గార్డెనింగ్‌ చేస్తారు. మరి హీరోయిన్‌ కాజల్‌ ఏం చేస్తారో తెలుసా? వంట చేస్తారట. ఈ విషయం గురించి కాజల్‌ మాట్లాడుతూ –‘‘నటిగా డే అండ్‌ నైట్‌ వర్క్‌ చేస్తూనే ఉంటాం. ఇంటికి దూరంగా షూటింగ్‌ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే మాత్రం  వంట చేస్తాను.

రిలాక్స్‌ అవ్వడానికి వంటని స్ట్రెస్‌బస్టర్‌గా భావిస్తాను. అలాగని మామూలు షెఫ్‌ని కాదు. టేస్టీ ఫుడ్‌ ప్రిపేర్‌ చేస్తాను. ఇంట్లో వాళ్లకు ఫుడ్‌ ప్రిపేర్‌ చేయడంలో భలే సరదా  ఉంటుంది. నేను చేసే ఆమ్లెట్‌ అంటే మా ఇంట్లో వాళ్లకు చాలా ఇష్టం. సో.. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేసినప్పుడు వంట చేయడానికి ప్రిఫర్‌ చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం ఈ  బ్యూటీ హిందీ చిత్రం క్వీన్‌ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top