సమంత... 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటిలా చేసింది!

K Raghavendra Rao Praised Samantha And Oh Baby Movie - Sakshi

మహానటి, రంగస్థలం, మజిలీ, యూటర్న్‌, తమిళంలో సూపర్‌డీలక్స్‌ ఇలా ప్రతీ సినిమాతో సక్సెస్‌ కొడుతూ.. నటిగా మరో మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను హైస్పీడ్‌తో దూసుకుపోయేలా చేస్తోంది సమంత. పెళ్లి చేసుకున్నాక సమంత రూటే మారిపోయింది. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. తనలోని నటిని కొత్తగా ఆవిష్కరించేందుకు.. వచ్చే నెలలో ‘ఓ బేబీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్దాయి.

తాజాగా విడుదలైన ట్రైలర్‌ అయితే సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లతో పాటు, సెలబ్రెటీలు కూడా ట్రైలర్‌కు లైక్‌లు కొడుతూ.. షేర్‌ చేస్తున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఈ ట్రైలర్‌పై స్పందిస్తూ సమంత డెబ్బై ఏళ్ల బామ్మల నటించింది అనడం కంటే డెబ్బై ఏళ్ల అనుభవం ఉన్న నటిలా చేసిందంటూ పొగడ్తల వర్షం కురింపించారు. ‘ నేను ఓ బేబీ సినిమా చూశాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్‌గా ఉంది. సమంత డెబ్బై ఏళ్ల బామ్మగా చేసింది అనడం కన్నా డెబ్బై ఏళ్ల అనుభవం ఉన్న నటిగా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది’ అని ట్వీట్‌ చేస్తూ.. ట్రైలర్‌ను షేర్‌ చేశారు. ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top