మరింత కొత్తగా... | K Raghavendra Rao announces a unique movie | Sakshi
Sakshi News home page

మరింత కొత్తగా...

May 29 2019 2:50 AM | Updated on Jul 15 2019 9:21 PM

K Raghavendra Rao announces a unique movie - Sakshi

వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలను లిఖించుకున్నారు దర్శకులు కె. రాఘవేంద్రరావు. ఆయన తీసిన చిత్రాలు కొత్త తరం డైరెక్టర్లకు మార్గదర్శకత్వం అంటే అతిశయోక్తి కాదు. అయితే రాఘవేంద్రరావు రెండేళ్లుగా సినిమాలు చేయడం లేదనే ఆయన అభిమానుల బాధ తీరిపోయింది. మంగళవారం కె.రాఘవేంద్రరావు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. ‘‘నా కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకమైనది. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో’’ అంటూ ‘‘ముగ్గురు డైరెక్టర్స్‌తో... ముగ్గురు హీరోయిన్లతో దర్శకేంద్రుడి సినిమా! హీరో??’’ అని రాసి ఉన్న పోస్టర్‌ కూడా షేర్‌ చేశారు. 2017లో నాగార్జున హీరోగా వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా రాని విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement