దర్శకుడు బాలచందర్‌కు పుత్ర వియోగం | k.bala chandar son was dead | Sakshi
Sakshi News home page

దర్శకుడు బాలచందర్‌కు పుత్ర వియోగం

Aug 16 2014 12:30 AM | Updated on Aug 20 2018 2:31 PM

దర్శకుడు బాలచందర్‌కు పుత్ర వియోగం - Sakshi

దర్శకుడు బాలచందర్‌కు పుత్ర వియోగం

ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కొడుకు కైలాసం బాలచందర్ (54) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. దీంతో బాలచందర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కొడుకు కైలాసం బాలచందర్ (54) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. దీంతో బాలచందర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కె.బాలచందర్‌కు కుమార్తె పుష్పాకందసామి, కొడుకులు కైలాసం బాలచందర్, ప్రసన్న బాలచందర్ ఉన్నారు. వీరిలో పుష్పా కందసామి చిత్ర రంగంలో నిర్మాతగా కొనసాగుతున్నారు. కైలాసం బాలచందర్ 20 రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కైలాసం బాలచందర్ కన్నుమూశారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement