breaking news
Kailasam Balachander
-
దర్శకుడు బాలచందర్‌కు పుత్ర వియోగం
ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కొడుకు కైలాసం బాలచందర్ (54) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. దీంతో బాలచందర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కె.బాలచందర్‌కు కుమార్తె పుష్పాకందసామి, కొడుకులు కైలాసం బాలచందర్, ప్రసన్న బాలచందర్ ఉన్నారు. వీరిలో పుష్పా కందసామి చిత్ర రంగంలో నిర్మాతగా కొనసాగుతున్నారు. కైలాసం బాలచందర్ 20 రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కైలాసం బాలచందర్ కన్నుమూశారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
కె.బాలచందర్ తనయుడు కైలాసం కన్నుమూత
చెన్నై: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతైన కె. బాలచందర్ (కైలాసం బాలచందర్) తనయుడు కైలాసం శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కైలాసం అనారోగ్యంతో బాధపడుతున్నటు సినీవర్గాలు తెలిపాయి.