లారెన్స్‌తో జ్యోతిక? | Jyothika act with Lawrence ? | Sakshi
Sakshi News home page

లారెన్స్‌తో జ్యోతిక?

Aug 8 2015 3:09 AM | Updated on Sep 3 2017 6:59 AM

లారెన్స్‌తో జ్యోతిక?

లారెన్స్‌తో జ్యోతిక?

లారెన్స్‌తో నటి జ్యోతిక నటించనున్నారా? దీనికి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది.

లారెన్స్‌తో నటి జ్యోతిక నటించనున్నారా? దీనికి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. కాంచన, కాంచన-2 చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న లారెన్స్ హర్రర్‌తో కూడిన వినోదభరిత చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టగా నిరూపించుకున్నారు. అంతేకాదు తాజాగా మొట్టశివ కెట్టశివ, నాగ అనే మరో రెండు భారీ హారర్ చిత్రాల నిర్మాణానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ రెండు చిత్రాల్లోనూ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. కాగా మొట్టశివ కెట్టశివ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక నాగ చిత్రంలో హీరోయిన్ కోసం నటి జ్యోతిక పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జ్యోతిక సుధీర్గ విరామం తరువాత 36 వయదినిలే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదలై విజయం సాధించినా ఆమె మరో చిత్రం ఏదీ ఒప్పుకోలేదు.

సూర్య జ్యోతిక జంటగా చిత్రాలు చేయడానికి పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు కథలు విన్న సూర్యను ఒక కథ ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. త్వరలో తన భర్త సూర్యతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని సమీపకాలంలో సూర్యనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో లారెన్స్ నాగ చిత్రంలో జ్యోతికను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. లరెన్స్ జ్యోతికకు కథ విపించినట్లు, త్వరలోనే ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగ గ్రాఫిక్స్ మయంగా సాగే హర్రర్ కామెడీ కథా చిత్రంగా రూపొందనుంది. ఈ తర హా పాత్రలో జ్యోతికి చంద్రముఖి చిత్రంలో అదరగొట్టార న్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉండదనుకుంటా. బహుశ లారెన్స్ కూడా ఇలాంటి ఆలోచనతోనే ఆమెను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారేమో.
       
 
 

Advertisement
 
Advertisement
Advertisement