'ఆ సినిమాను తిట్టడం ఏం బాలేదు' | Juhi Chawla on Snapdeal case, Do not blame Darr for abduction | Sakshi
Sakshi News home page

'ఆ సినిమాను తిట్టడం ఏం బాలేదు'

Feb 16 2016 11:15 AM | Updated on Oct 22 2018 5:17 PM

'ఆ సినిమాను తిట్టడం ఏం బాలేదు' - Sakshi

'ఆ సినిమాను తిట్టడం ఏం బాలేదు'

స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్‌ మిస్టరీ వీడటంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ముంబై: స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్‌ మిస్టరీ వీడటంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా షారుఖ్‌ఖాన్, జూహ్లీ చావ్లా జంటగా నటించిన 'డర్‌' (1993) సినిమా ఈ కిడ్నాప్ కు ప్రేరణ అని తేలడం కొత్త చర్చకు దారితీసింది.

'డర్‌' సినిమాలో షారుఖ్ తరహాలోనే దాదాపు ఏడాదిపాటు దీప్తిని రహస్యంగా వెంటాడిన కిడ్నాపర్‌.. ఆ సినిమా ప్రేరణతోనే ఆమెను కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ చిత్రాలపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 'డర్‌' సినిమాలో నటించిన హీరోయిన్ జూహ్లీ చావ్లా మాత్రం సమాజంలో జరిగే తప్పులకు సినిమాలను నిందించడం సరికాదు అంటున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో 'డర్‌' చిత్రాన్ని తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు.

'సినిమా ముగింపులో సత్యమే విజయం సాధించినట్టు మేం ఎప్పుడూ చూపిస్తాం. సినిమాను మధ్యలోనే వదిలేసి మీకు నచ్చింది ఎంచుకోమని, చెడు చేయమని ఎప్పుడూ ప్రేక్షకులకు బోధించం. ప్రజల జీవితాలపై బాలీవుడ్‌ చిత్రాలు మాత్రమే కాదు వ్యక్తిగత, కుటుంబ ప్రభావాలు కూడా ఉంటాయి' అని జూహ్లిలీచావ్లా అన్నారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్‌ భట్‌ కూడా  ఈ విషయంలో స్పందించారు. 'నిజజీవితంలోని ఘట్టాలే సినిమాలకు ప్రేరణ అవుతాయి. సినిమాలోని దృశ్యాలు నిజజీవితంలోనూ ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో చర్చ ఎప్పుడూ ఉన్నదే. సినిమాలు, పుస్తకాలు సమాజాన్ని మార్చి ఉంటే ఈపాటికే ప్రపంచం స్వర్గధామం అయ్యేది' అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement