breaking news
Darr
-
'ఆ సినిమాను తిట్టడం ఏం బాలేదు'
ముంబై: స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్ మిస్టరీ వీడటంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా షారుఖ్‌ఖాన్, జూహ్లీ చావ్లా జంటగా నటించిన 'డర్' (1993) సినిమా ఈ కిడ్నాప్ కు ప్రేరణ అని తేలడం కొత్త చర్చకు దారితీసింది. 'డర్' సినిమాలో షారుఖ్ తరహాలోనే దాదాపు ఏడాదిపాటు దీప్తిని రహస్యంగా వెంటాడిన కిడ్నాపర్.. ఆ సినిమా ప్రేరణతోనే ఆమెను కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రాలపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 'డర్' సినిమాలో నటించిన హీరోయిన్ జూహ్లీ చావ్లా మాత్రం సమాజంలో జరిగే తప్పులకు సినిమాలను నిందించడం సరికాదు అంటున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో 'డర్' చిత్రాన్ని తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. 'సినిమా ముగింపులో సత్యమే విజయం సాధించినట్టు మేం ఎప్పుడూ చూపిస్తాం. సినిమాను మధ్యలోనే వదిలేసి మీకు నచ్చింది ఎంచుకోమని, చెడు చేయమని ఎప్పుడూ ప్రేక్షకులకు బోధించం. ప్రజల జీవితాలపై బాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాదు వ్యక్తిగత, కుటుంబ ప్రభావాలు కూడా ఉంటాయి' అని జూహ్లిలీచావ్లా అన్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కూడా ఈ విషయంలో స్పందించారు. 'నిజజీవితంలోని ఘట్టాలే సినిమాలకు ప్రేరణ అవుతాయి. సినిమాలోని దృశ్యాలు నిజజీవితంలోనూ ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో చర్చ ఎప్పుడూ ఉన్నదే. సినిమాలు, పుస్తకాలు సమాజాన్ని మార్చి ఉంటే ఈపాటికే ప్రపంచం స్వర్గధామం అయ్యేది' అని ఆయన అన్నారు. -
షారుఖ్ సినిమా ప్రేరణతోనే కిడ్నాప్!
ఘజియాబాద్: స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి శర్న కిడ్నాప్ వ్యవహారంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్లకు సహకరించిన వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అనేక మలుపులు తిరిగి ఆఖరికీ దీప్తి ఇంటికి సురక్షితంగా చేరిన ఈ కిడ్నాప్ వ్యవహారానికి ప్రేరణ 'డర్' సినిమా అట. షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, జుహ్లీ చావ్లా జంటగా నటించిన 'డర్' సినిమా ప్రేరణతోనే తాము ఈ కిడ్నాప్ కుట్రకు పథకం రచించామని ప్రధాన నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 27 ఏళ్ల ప్రధాన నిందితుడు హర్యానా పానిపట్‌కు చెందిన వాడు కాగా, అతనికి సహకరించిన వారు ఉత్తరప్రదేశ్‌లోని బద్వాన్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 24 ఏళ్ల దీప్తి ఈ నెల 5న కిడ్నాప్ అయింది. ఐదురోజుల తర్వాత గత బుధవారం సాయంత్రం ఆమెను కిడ్నాపర్లు విడిచిపెట్టారు. వాళ్లు ఆమెకు ఎలాంటి హాని తలపెట్టలేదు. తమ చెరలో ఉన్నన్ని రోజులు కిడ్నాపర్లు తనను బాగానే చూసుకున్నారని, ఆహారం అందించడమే కాకుండా తిరిగి ఇంటికి వెళ్లేందుకు డబ్బు కూడా ఇచ్చారని దీప్తి పోలీసులకు తెలిపింది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారం గుట్టును ఛేదించేందుకు పోలీసులు ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.