పండగే పండగ | Jr NTR's Birthday Special: First Look Teaser of 'Rabhasa' to be Released | Sakshi
Sakshi News home page

పండగే పండగ

May 19 2014 10:26 PM | Updated on Sep 2 2017 7:34 AM

పండగే పండగ

పండగే పండగ

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడాయన దృష్టి మొత్తం విజయంపైనే. అందుకే... కసితో ‘రభస’ సినిమా చేస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు.

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడాయన దృష్టి మొత్తం విజయంపైనే. అందుకే... కసితో ‘రభస’ సినిమా చేస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం ‘రభస’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఆగస్ట్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమా గురించి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘‘రభస’లో ఎన్టీఆర్ సామాన్యులను ఎంతో ఆకట్టు కుంటారు.
 
 యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఆయన పాత్ర చిత్రణ సాగుతుంది. అందరూ అయిదారుసార్లు చూసేంత వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. అభిమానులకైతే పండుగలా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రం బెల్లంకొండ సురేశ్ మేకింగ్ సత్తాను తెలియజేస్తుంది’’ అని చెప్పారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాదు, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని బెల్లంకొండ సురేశ్ తెలిపారు. సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలందిస్తున్నారు.
 
 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...
 ఎన్టీఆర్ వేగం పెంచారు. ‘రభస’ తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. పూరి జగన్నాథ్‌తో ఓ చిత్రానికి పచ్చజెండా ఊపారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రానికి బండ్ల గణేశ్ నిర్మాత. ‘‘మా సంస్థ నిర్మించిన ‘బాద్‌షా’ చిత్రం తారక్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన   సినిమాగా నిలిచింది. ఆ సినిమా సమయంలోనే మా సంస్థలో మరో సినిమా చేస్తానని ఆయన మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సినిమా చేయనున్నారు.
 
 ఎన్టీఆర్-పూరీజగన్నాథ్ లాంటి క్రేజీ కాంబినేషన్‌తో చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తా’’ అని గణేశ్ తెలిపారు. ఈ రెండు చిత్రాలతో పాటు పీవీపీ సంస్థ నిర్మించనున్న చిత్రంలో కూడా ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రంలో నాగార్జునతో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి మల్టీస్టారర్ ఇదే కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement