రావణ దర్పం! | jr ntr new movie jai lovakusa first look | Sakshi
Sakshi News home page

రావణ దర్పం!

May 19 2017 11:39 PM | Updated on Sep 5 2017 11:31 AM

రావణ దర్పం!

రావణ దర్పం!

రావణుడిలో రౌద్రం, రాజసం రెండూ ఉంటాయి. రెండిటినీ ఒకేసారి చూపిస్తూ, దర్పం ఒలకబోస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి!

రావణుడిలో రౌద్రం, రాజసం రెండూ ఉంటాయి. రెండిటినీ ఒకేసారి చూపిస్తూ, దర్పం ఒలకబోస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి! అటువంటి రావణ దర్పానికి ప్రతీకగా ‘జై లవకుశ’లో ఓ పాత్ర ఉంటుందట! ఎన్టీఆర్‌ హీరోగా కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఇద్దరి పేర్లు లవ, కుశ అయితే... మరొకరి పేరు ‘జై’ అట! ఈ రోజు ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ‘జై లవకుశ’లో అతని ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు.

సినిమాలో ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ రోల్‌ చేస్తున్నారు కదా! మరి, ఈ లుక్‌ ఎవరిది అంటే... రౌద్ర రావణ రాజస దర్పానికి ప్రతీకగా తీర్చిదిద్దిన ‘జై’ పాత్రదనే మాటలు వినిపిస్తున్నాయి. వీటిపై దర్శక, నిర్మాతలు ఏమంటారో! రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా, నందిత ముఖ్య తారగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది సెకండాఫ్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement