హరికేన్‌ బాధితులకు నటి భారీ విరాళం | Jennifer aniston funds to hurricane victims | Sakshi
Sakshi News home page

హరికేన్‌ బాధితులకు నటి భారీ విరాళం

Oct 13 2017 11:53 PM | Updated on Oct 14 2017 12:08 AM

Jennifer aniston funds to hurricane victims

లాస్‌ఏంజిలెస్ ‌: హార్వీ, ఇర్మా, మారియా హరికేన్‌లు ఒకదాని తరువాత ఒకటి అమెరికాను కకావికలం చేసిన విషయం తెలిసిందే. ఈ వరుస విపత్తులతో వేలాదిమంది రోడ్డునపడ్డారు. కాగా వీరిని ఆదుకునేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ ఆనిస్టన్‌ భారీ విరాళాన్ని ప్రకటించి, తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విపత్తుల్లో సర్వం కోల్పోయిన వారిని ఆదుకొని, వారి జీవితాలను నిలబెట్టేందుకు ప్యూర్టోరికో రిలీఫ్‌ఫండ్‌కు 10 లక్షల డాలర్లను జెన్నీఫర్‌ విరాళంగా ప్రకంటించారు. ఈ మొత్తంలో ఐదులక్షల డాలర్లను అమెరికన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థకు,  మరోక ఐదు లక్షలను సింగర్‌ రికీ మార్టిన్‌ పౌండేషన్‌కు అందజేయాలని సూచించారు.

విరాళంపై సంతోషం వ్యక్తం చేసిన మార్టిన్‌.. జెన్నీఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ... 'ఈ మేలును ఎప్పటికీ మరువలేం. ఈ సాయం అనేకమంది జీవితాలను నిలబెడుతుందంటూ' ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కాగా ఇప్పటికే స్టార్ హీరో, అస్కార్ నటుడు లియోనార్డో డికాప్రియో, జెన్నీఫర్‌ లోపేజ్, నిక్‌ రోల్, స్టీఫెన్‌ కోల్‌బర్ట్‌ తదితర హాలీవుడ్‌ నటులెందరో తమ వంతుగా బాధితులకు సాయం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement