అవును.. మేం విడిపోయాం! | Jennifer Aniston 'upset' after Justin cuddled Naomi Watts | Sakshi
Sakshi News home page

అవును.. మేం విడిపోయాం!

Feb 19 2018 12:40 AM | Updated on Feb 19 2018 12:42 AM

Jennifer Aniston 'upset' after Justin cuddled Naomi Watts - Sakshi

జెన్నిఫర్‌ అనిస్టన్‌

హాలీవుడ్‌ స్టార్‌ జెన్నిఫర్‌ అనిస్టన్‌ 49వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆమె ఫ్రెండ్స్‌ అంతా కలిసి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటున్నారు. కానీ ఆ వేడుకలో ఆమె భర్త జస్టిన్‌ థెరో మాత్రం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదంటే.. అక్కడున్న ఆమె ఫ్రెండ్స్‌కి తెలుసు. కానీ అక్కడున్న అందరికీ అయితే తెలీదు. తెలీదు కాబట్టి వాళ్లంతా పుకార్లు పుట్టిస్తారు. జస్టిన్‌ ఎందుకు లేడనే పుకార్లు. అంత దూరం ఎందుకు పోవడం అనుకుంది జెన్నిఫర్‌. జస్టిన్‌తో కలిసి ఒక కంబైన్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది.. ‘అవును.. మేమిద్దరం విడిపోయాం!’ అని. 

2015లో పెళ్లి చేసుకున్న జస్టిన్, జెన్నిఫర్‌ల బంధం మూడేళ్లు కాకముందే విడాకుల వరకు వెళ్లింది. నిజానికి 2017లోనే ఈ ఇద్దరూ విడిపోయినా ఆ విషయాన్ని ప్రైవేటుగానే ఉంచేద్దాం అనుకున్నారట. కాకపోతే, జెన్నిఫర్‌ బర్త్‌డే తర్వాత గాసిప్స్‌ వస్తాయన్న అనుమానం రావడంతో, ఎట్టకేలకు తాము విడిపోయినట్లు అనౌన్స్‌ చేసేశారు. ‘‘భార్యాభర్తలుగా కొనసాగలేం అని అనుకున్నాక ఇద్దరం విడిపోవాలనే నిర్ణయించుకున్నాం. అయితే విడిపోయాకా మేమిద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్‌గానే కొనసాగుతాం’’ అని ఇద్దరూ కలిసి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గతంలో బ్రాడ్‌పిట్‌తో కూడా జెన్నిఫర్‌ ఇలా ఎలాంటి గొడవలు లేనప్పుడే సామరస్యంగా విడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement