మాఫియా నేపథ్యంలో జయంత్ సినిమా | jayanth c paranji new movie ugram | Sakshi
Sakshi News home page

మాఫియా నేపథ్యంలో జయంత్ సినిమా

Sep 20 2016 1:24 PM | Updated on Sep 4 2017 2:16 PM

మాఫియా నేపథ్యంలో జయంత్ సినిమా

మాఫియా నేపథ్యంలో జయంత్ సినిమా

ఒకప్పుడు స్టైలిష్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న జయంత్ సి పరాన్జీ, ఈ మధ్య ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్తో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న జయంత్...

ఒకప్పుడు స్టైలిష్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న జయంత్ సి పరాన్జీ, ఈ మధ్య ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్తో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న జయంత్, తరువాత వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయాడు. దీంతో చాలా రోజులుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న జయంత్ తాజాగా గంటా శ్రీనివాస్ తనయుణ్ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు.

ఉగ్రం పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాతో నీలేష్ ఈటి అనే కొత్త హీరోను పరిచయం చేయనున్నాడు. ఇసాబెల్లా అనే మోడల్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ముంబై మాఫియాకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కు మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఎక్కువగా భాగం షూటింగ్ ముంబైలోనే జరగనుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను పూర్తిచేసి నవంబర్ నుంచి ఉగ్రంను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ ఉన్నాడు జయంత్.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement