హీరోలానే కనిపించాడు | Jayammu Nischayammura trailer: Srinivas Reddy comes with a novel role | Sakshi
Sakshi News home page

హీరోలానే కనిపించాడు

Nov 13 2016 11:11 PM | Updated on Sep 4 2017 8:01 PM

హీరోలానే కనిపించాడు

హీరోలానే కనిపించాడు

‘‘శ్రీనివాస్‌రెడ్డి నాకు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చూపించాడు. చిత్రంలో రెండున్నర గంటలు అతను నాకు హీరోలానే కనిపించాడు’’

‘‘శ్రీనివాస్‌రెడ్డి నాకు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చూపించాడు. చిత్రంలో రెండున్నర గంటలు అతను నాకు హీరోలానే కనిపించాడు’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి హీరోగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. రచయిత వక్కంతం వంశీ, దర్శకుడు అనిల్ రావిపూడి, కొరటాల శివ ప్రచార చిత్రాలను రిలీజ్ చేశారు. ‘‘ఇటీవల ఇంత మంచి చిత్రం చూడలేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించవచ్చో ఈ చిత్రంతో అర్థమైంది.

మా అన్నయ్యగారి అబ్బాయి రవిచంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించాడని లేటుగా తెలిసింది’’ అని కొరటాల అన్నారు. ‘‘ఈ వారంలో ఆడియో, ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు శివరాజ్ కనుమూరి. హీరో శ్రీనివాస్‌రెడ్డి, చిత్ర సమర్పకులు ఏవీఎస్ రాజు, నిర్మాతలు నీలం కృష్ణారెడ్డి, సతీశ్ కనుమూరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement