డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి! | Jai Lava Kusha trailer in Hyderabad on September 10 released | Sakshi
Sakshi News home page

డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి!

Aug 31 2017 1:13 AM | Updated on Sep 17 2017 6:09 PM

డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి!

డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి!

ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేధా థామస్‌ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జై లవకుశ’.

ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేధా థామస్‌ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జై లవకుశ’. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 3న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.

నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘జై లవకుశ’ పాటలను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలనుకున్నాం. భారీ వర్ష సూచనతో పాటు, పోలీస్‌ శాఖవారు వినాయక నిమజ్జనంలో నిమగ్నమై ఉండటంతో, అభిమానుల భద్రతకి ప్రాధాన్యం ఇస్తూ, పాటలను డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం. కానీ, సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ను మాత్రం అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా చేస్తాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement