జై.. లవ.. కుశతో స్పెషల్‌ సాంగ్‌లో? | Jai .. Lava .. Kausha movie in Tamanna Special Song? | Sakshi
Sakshi News home page

జై.. లవ.. కుశతో స్పెషల్‌ సాంగ్‌లో?

Aug 29 2017 12:34 AM | Updated on Sep 17 2017 6:03 PM

జై.. లవ.. కుశతో స్పెషల్‌ సాంగ్‌లో?

జై.. లవ.. కుశతో స్పెషల్‌ సాంగ్‌లో?

‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్‌’ చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో దుమ్ము రేపారు మిల్కీ బ్యూటీ తమన్నా.

‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్‌’ చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో దుమ్ము రేపారు మిల్కీ బ్యూటీ తమన్నా. తాజాగా ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జై లవకుశ’ సినిమాలోనూ ఆమె ఓ ప్రత్యేక పాట చేయనున్నారని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

ఎన్టీఆర్‌ తొలిసారి మూడు పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రంలో ఉన్న ఓ ప్రత్యేక పాటను తమన్నాతో చేయిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. తమన్నాని సంప్రదించగా, నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌. కాగా, ‘జనతాగ్యారేజ్‌’ చిత్రంలో ‘పక్కా లోకల్‌’ పాట తమన్నా చేస్తారంటూ వార్తలొచ్చినా, కాజల్‌ చేశారు. అప్పుడు మిస్‌ అయిన అవకాశం ‘జై లవకుశ’తో మిల్కీ బ్యూటీకి దక్కిందని బోగట్టా.

Advertisement
 
Advertisement
Advertisement