
సాక్షి, విజయవాడ: చిన్న సినిమాలను కాపాడాల్సిన అవసరం ఉందని సినీనటుడు జగపతిబాబు అన్నారు. ధియేటర్లు కొంతమంది చేతుల్లో వుండటం వల్ల చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయని, కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సినిమాల్లోకి వచ్చి ముప్పై ఏళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడ వన్‌టౌన్ వీధుల్లో ఛారిటి వాక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన నడక వెనుక ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేసేందుకు తాను రాలేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేకహోదా అంశంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో ఉత్తమ విలన్‌గా జగపతిబాబు ఎంపికయ్యారు. లెజెండ్ సినిమాలో నటనకు ఆయన అవార్డు లభించింది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)