కిక్ మార్చింది భవిత | Jacqueline Fernandez gets more offers after acted in KICK movie | Sakshi
Sakshi News home page

కిక్ మార్చింది భవిత

Aug 8 2014 2:22 AM | Updated on Sep 2 2017 11:32 AM

కిక్ మార్చింది భవిత

కిక్ మార్చింది భవిత

జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు బాగానే ‘కిక్’ దొరికింది. సల్మాన్‌తో నటించిన ‘కిక్’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో జాక్విలిన్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు బాగానే ‘కిక్’ దొరికింది. సల్మాన్‌తో నటించిన ‘కిక్’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో జాక్విలిన్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ‘రాయ్’తో పాటు హృతిక్ రోషన్‌తో ఒక చిత్రానికి సంతకం చేసిన జాక్విలిన్, తాజాగా కరణ్ జోహార్ చిత్రం ‘వారియర్’లో నటించేందుకు సంతకం చేసింది. ఇందులో అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
 
 కౌర్‌కు దొరికింది కథ
 తొలిచిత్రం ‘కర్‌లే ప్యార్ కర్‌లే’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో కొన్నాళ్లు తెరమరుగైన హస్లీన్ కౌర్, తాజాగా ‘డీఎన్‌ఏ ఆఫ్ లవ్’ చిత్రంతో తెర ముందుకొస్తోంది. అమిత్ కసారియా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అధ్యయన్ సుమన్ సరసన హస్లీన్ హీరోయిన్‌గా నటించనుంది. ఒక రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్ర కథ ఉత్కంఠభరితంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
 
 కుర్ర హీరోకు దక్కింది ఘనత
 జాకీ షరాఫ్ కొడుకు టైగర్ షరాఫ్‌ను దక్షిణ కొరియా సర్కారు సత్కరించనుంది. తొలిచిత్రం ‘హీరోపంతి’లో టైగర్ షరాఫ్ తైక్వాండో పోరాట దృశ్యాలు కొరియన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో తైక్వాండో రాజధానిగా పేరుపొందిన కుకివాన్ పట్టణంలో టైగర్ షరాఫ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తైక్వాండోలో ఐదో డిగ్రీ బ్లాక్‌బెల్ట్ సాధించిన టైగర్ షరాఫ్‌ను యూత్ ఐకాన్‌గా సత్కరించాలని దక్షిణ కొరియా సర్కారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement