ప్రేమ పులకింతలు... | it's my love story | Sakshi
Sakshi News home page

ప్రేమ పులకింతలు...

Apr 11 2014 11:57 PM | Updated on Sep 2 2017 5:54 AM

ప్రేమ పులకింతలు...

ప్రేమ పులకింతలు...

ప్రేమజల్లులో తడిసి ముద్దవ్వని వాడంటూ ఉండడు. అది పెళ్లికి ముందు అయినా సరే... తర్వాతైనా సరే. ప్రేమజల్లులో మాత్రం తడవడం తథ్యం.

ప్రేమజల్లులో తడిసి ముద్దవ్వని వాడంటూ ఉండడు. అది పెళ్లికి ముందు అయినా సరే... తర్వాతైనా సరే. ప్రేమజల్లులో మాత్రం తడవడం తథ్యం. అలా ప్రేమ పలకరింపుతో పులకరించిన ఓ మధ్యతరగతి కుర్రాడి కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘నేనూ.. నా ప్రేమకథ’. శేఖర్, సుష్మా జంటగా నటిస్తున్నారు.

వర్ధన్ దర్శకుడు. వర్మ, పనుకు రమేశ్‌బాబు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే మధ్య తరగతి కుర్రాడి ప్రేమకథ ఇది. కోపతాపాలు, ప్రేమ ముచ్చట్లతో సహజం, స్వచ్ఛంగా ఈ కథ సాగుతుంది.
 
యువతరాన్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘ప్రేమలో వచ్చే పొరపొచ్చాలను హీరోహీరోయిన్లు ఎలా అధిగమించారు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. మన పొరుగునే జరుగుతున్న కథలా అత్యంత సహజంగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు. హైదరాబాద్, గోవా, బ్యాంకాక్, శ్రీలంకల్లో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించాం. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ జరుగుతోంది. మే తొలివారంలో పాటల్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు.
 
ఈ చిత్రానికి కెమెరా: నగేశ్ ఆచార్య, సంగీతం: చిన్ని చరణ్, మిథున్ ఎం.ఎస్, సమర్పణ: వింగ్ కమాండర్ కె.ఎస్.రావు, నిర్మాణం: దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్తా మీడియా.

Advertisement
 
Advertisement
Advertisement