ఆజన్మ బ్రహ్మచారిగా నితిన్‌ | Intresting Title For Nithin Next Bhishma Single Forever | Sakshi
Sakshi News home page

Jun 20 2018 1:58 PM | Updated on Jun 20 2018 1:58 PM

Intresting Title For Nithin Next Bhishma Single Forever - Sakshi

టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు. ప్రభాస్‌, రానా దగ్గుబాటి లతో నితిన్‌ కూడా వయసు పెరుగుతున్న సినిమాలతోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా నితిన్‌ సింగిల్‌ ఫర్‌ఎవర్‌ అనే స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో మాత్రం కాదు. రీల్‌ లైఫ్‌లోనే. ప్రస్తుతం సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్‌ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌ కు ఓకె చెప్పాడు.

ఛలో సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మా అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేశారు. అంతేకాదు సింగిల్‌ ఫర్‌ఎవర్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మా పేరుతో లవ్‌ స్టోరి తెరకెక్కిస్తుండటంతో భీష్మాపై ఆసక్తి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement