ఇంకొకడు రిలీజ్ వాయిదా | inkokkadu release postponed | Sakshi
Sakshi News home page

ఇంకొకడు రిలీజ్ వాయిదా

Aug 22 2016 1:21 PM | Updated on Sep 4 2017 10:24 AM

ఇంకొకడు రిలీజ్ వాయిదా

ఇంకొకడు రిలీజ్ వాయిదా

విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇంకొకడు. విక్రమ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇంకొకడు. విక్రమ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. నయనతార, నిత్యామీనన్లు విక్రమ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసింది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందన్న వార్త వినిపిస్తోంది.

కొంత కాలంగా తన స్ధాయికి తగ్గ సక్సెస్ సాధించటంతో విఫలమవుతున్న హీరో విక్రమ్, ఇరుముగన్ సినిమాతో భారీ కలెక్షన్ల మీద కన్నేశాడు. అందుకే తమిళ్తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 1న ఇంకొకడు సినిమాను రిలీజ్ చేస్తే ఆ తరువాత రోజే రిలీజ్ అయ్యే జనతా గ్యారేజ్ సినిమా నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ కూడా తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు.  దీంతో తన సినిమాను వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు విక్రమ్. ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 1న కాకుండా ఇంకొకడు సినిమాను సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement