నా కెరీర్‌లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది! | Inkokkadu Movie Audio Launched | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

Aug 16 2016 11:23 PM | Updated on Sep 4 2017 9:31 AM

నా కెరీర్‌లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

నా కెరీర్‌లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు విక్రమ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఇరుముగన్’.

సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు విక్రమ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఇరుముగన్’. నయనతార, నిత్యామీనన్ కథానాయికలు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఎన్‌కేఆర్ ఫిలింస్ పతాకంపై ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హరీష్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. స్నేహ గ్రూప్ ఎండీ వరుణ్‌రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ట్రైలర్ ఆవిష్కరించారు.
 
 విక్రమ్ పాటల సీడీని విడుదల చేసి రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు అందించారు. విక్రమ్ మట్లాడుతూ-‘‘ఇప్పటివరకూ నేను చేసిన గొప్ప పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన అఖిలన్, లవ్ క్యారెక్టర్లు కూడా నిలుస్తాయని చెప్పగలను. మంచి కథ తయారు చేసుకుని దాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఆనంద్‌కు మంచి భవిష్యత్ ఉంది. తనతో మరో రెండు, మూడు చిత్రాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా, వ్యక్తిగా విక్రమ్ సూపర్. ఆయన నటనలో చీటింగ్ కనిపించదు. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలందరూ నెల్లూరుకు చెందిన వారే.
 
  కృష్ణారెడ్డి కూడా నెల్లూరివాసి కావడం సంతోషం’’ అని పేర్కొన్నారు. ఆనంద్ శంకర్ మాట్లాడుతూ- ‘‘ఈరోజు నేనిక్కడ నిలబడ్డానంటే కారణం విక్రమ్‌గారే. తెలుగు ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయాలనుంది. ఈ చిత్రంలో విక్రమ్‌గారు రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు’’ అని చెప్పారు. ‘‘పది చిత్రాలు పంపిణీ చేశాను. నిర్మాతగా నాకిది తొలి చిత్రం. సెప్టెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నీలం కృష్ణారెడ్డి తెలిపారు. ఈ వేడుకలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నిర్మాతలు బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రాజ్ కందుకూరి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement