'అమీ తుమీ' ఫస్ట్ లుక్ | indraganti Mohana Krihshna Ami tumi First Look | Sakshi
Sakshi News home page

'అమీ తుమీ' ఫస్ట్ లుక్

Mar 28 2017 4:19 PM | Updated on Aug 11 2019 12:30 PM

'అమీ తుమీ' ఫస్ట్ లుక్ - Sakshi

'అమీ తుమీ' ఫస్ట్ లుక్

రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటిమోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా

రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలను తెరకెక్కించే ఇంద్రగంటిమోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా అమీ తుమీ. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు.  గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement