సోహన్‌ చౌహాన్‌ అనుమానాస్పద మృతి

India’s Got Talent, MasterChef India Post-producer Sohan Chauhan Found Dead - Sakshi

ముంబై: ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’, ‘మాస్టర్‌ చెఫ్‌ ఇండియా’ కార్యక్రమాల పోస్ట్‌ ప్రొడ్యూసర్‌ సోహాన్‌ చౌహాన్‌ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం రాత్రి ముంబైలోని రాయల్‌ పామ్‌ సొసైటీకి చెందిన చెరువులో అతని మృతదేహం దొరికింది. సోహాన్‌ చౌహాన్‌ చనిపోయి మూడు రోజులు గడుస్తున్నా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చౌహన్‌ టీవీ షోలకు పోస్ట్‌ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా, అతను ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నారు.

సోహాన్‌ చౌహాన్‌ జూన్‌ 13 వరకు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్నారు. అంతకుముందు జూన్‌ 9న ‘సరిగమప లిటిల్‌ చాంప్స్‌’ ఫైనల్స్‌ కోసం పోస్ట్‌ కూడా చేశారు. చౌహాన్‌ను చివరిసారిగా శనివారం అతని ఇంట్లో పని చేసే వ్యక్తి చూశాడు. సోహాన్‌ ప్రమాదవశాత్తూ మరణించారా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top