బిగ్‌బాస్‌ ఇంట్లో ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌ | Independence Day Celebrations In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ ఇంట్లో ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌

Aug 15 2019 10:50 PM | Updated on Aug 15 2019 10:56 PM

Independence Day Celebrations In Bigg Boss 3 Telugu - Sakshi

పంద్రాగస్టు.. దేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకల్లో తేలిపోయింది. అలాగే.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు కూడా స్వాతంత్య్ర వేడకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏదైన సామాజకి కోణాన్ని స్పృశిస్తూ.. సమస్యలపై స్కిట్‌చేయవల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించాడు. హౌస్‌మేట్స్‌ రెండు టీమ్స్‌గా విడిపోయిన వేసిన స్కిట్స్‌లో డెప్త్‌ లేకపోయినా.. కంటెంట్‌ మాత్రం కరెక్ట్‌గానే ఉంది. గురువారం నాటి ఎపిసోడ్‌ సాగిందిలా..

బాత్రూం సెక్షన్‌ను క్లీనింగ్‌ చేస్తున్న బాబా భాస్కర్‌ పనుల్లో శ్రీముఖి అనవసరంగా వేలు పెట్టడంతో.. లివింగ్‌ ఏరియాను క్లీనింగ్‌ చేసిన శ్రీముఖిపై సెటైర్‌లు వేసుకుంటూ ఉన్నాడు. లివింగ్‌ ఏరియాలో ఉన్న టేబుల్‌, టీవీల దుమ్ము ఉండటంతో వాటిని చూపిస్తూ.. ఏం పని చేశారంటూ హౌస్‌మేట్స్‌తో చెప్పుకొచ్చాడు. బాబా భాస్కర్‌ చేస్తున్న పనిలో ఎవరు తలదూర్చమన్నారు.. అందుకే మీరు చేసిన పనిలో ఇప్పుడు బాబా భాస్కర్‌ వేలు పెడుతున్నాడంటూ కెప్టెన్‌ అలీరెజా పేర్కొన్నాడు.

లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ఇంటి సభ్యులకు ఏ వస్తువులు కావాలో.. అలీరెజా వెల్లడించాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ప్రతీ హౌస్‌మేట్స్‌కు అవసరమైన, ఇష్టమైన తిండి పదార్థాలను లగ్జరీ బడ్జెట్‌లో పేర్కొన్నాడు. అనంతరం ఇండిపెండెన్స్‌ డేకు సంబంధించిన టాస్క్‌ను చేయవల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశాలు జారీ చేశాడు. స్త్రీ పురుష సమానత్వాన్ని తెలియజేసేట్టుగా మహేష్‌, రవికృష్ణ, అషూ , పునర్నవి, వితికాలు ఓ స్కిట్‌ వేశారు. అయితే ఈ స్కిట్‌ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోయింది. ప్రేమికులు వారి మధ్య గొడవలు, ఇద్దరూ ఆధిపత్యం కోసం వాదనలు వినిపించడం.. తాము గొప్పంటే తాము గొప్ప అని చెప్పుకోవడం తప్పా.. స్కిట్‌ను ఆసక్తికరంగా మలచలేకపోయారు.

స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానంతరం పరిస్థితులను తెలియజేసేందుకు ప్రయత్నించారు. అసలు నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా? అమ్మాయిలు అర్థరాత్రి నడుస్తున్నారు.. కానీ అబ్బాయిలు మాత్రం నడవనివ్వడం లేదు..? ఇక్కడే పుట్టి ఇక్కడే చదివి.. మన ప్రతిభను పక్క దేశాలకు తాకట్టు పెడతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కొంతలోకొంత శ్రీముఖి గ్యాంగ్‌ చేసిన స్కిట్‌ పర్వాలేదనిపించింది. అనంతరం దేశ భక్తి గీతాలను ప్లే చేయగా.. ఇంటి సభ్యులందరూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌హౌస్‌లో విజ్ఞాన ప్రదర్శన జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులకు జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తుండగా.. అందరూ తెల్లమొహం వేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ విజ్ఞాన ప్రదర్శనలో ఎవరు సమాధానాలు చెప్పి విజేతగా నిలుస్తారో తెలియాలంటే శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement